13-12-2025 12:03:10 AM
మారుమూల గిరిజన గ్రామాల్లో ఎంపీ ఎన్నికల ప్రచారం
పాల్వంచ, డిసెంబర్ 12, (విజయక్రాంతి): మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ కే సాధ్యం అని సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి కోరారు. పాల్వంచ మండలం పరిధి లోని మారుమూల గిరిజన గ్రామాలైన చంద్రాలగూడెం, రేగులగూడెం, బంజర, మల్లారం, లక్ష్మీదేవిపల్లి, ఉల్వనూరు, మందెరకలపాడు, మొండికట్ట(సత్యనారాయణ పురం), కారేగట్టు, ప్రభాతనగర్ (రెడ్డిగూడెం), పాత సూరారం, కొత్త సూరారం, తొగ్గూడెం గ్రామాల్లో ఆయన విసృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎం పీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. పేద బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఎం.పి రఘురాం రెడ్డి కి ఘన స్వాగతం పలికిన గిరిజనులు ఎన్నికలప్రచారం కోసం పర్యటించిన ఎం.పి రఘురాం రెడ్డి కి ఆయా ప్రాంతాల గిరిజనులు,మహిళలు ఘనంగా స్వాగతం పలికా రు.మహిళలు నుదుట కుంకుమ దిద్ది,మంగళహారతులు పట్టారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ మా ర్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, మాజీ జెడ్ పి చైర్మన్ బరిపటి వాసుదేవరావు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ జాలె జానకిరెడ్డి, మాజీ zptc యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఊకంటి గోపాలరావు,వై వెంకటేశ్వరరావు,కాపర్తి వెంకటాచారి, చింతా నాగరాజు,పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.