ప్రతికూల ఫలితానికి మూలం?
ఏ ఎన్నికైనా రాజకీయ ప్రభావితమైనదే రాజకీయాలను ప్రభావితం చేసేవే. తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజానికి గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయాలకు పెద్దగా సంబంధం ఉండకూడదు కానీ ఈ ఎన్నికలలో కూడా పార్టీలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ జోక్యం చేసుకోవటం వలన పార్టీ రహితం గా జరగాల్సిన ఎన్నికలు కాస్తా రాజకీయ బలాబలాల వేదికగా మారిపోయినాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సాధారణ ఎన్నికల మాదిరిగానే జరిగిన ప్రచార తీరు, పం చిన డబ్బు, తాయిలాలు, ఇచ్చిన హామీలు చూస్తుంటే దిగజారుతున్న రాజకీయ విలువలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకమై న నియోజకవర్గాలకు జరిగే ఈ ఎన్నికల లో ఉపాధ్యాయ సంఘాలు కూడా రాజకీ య పార్టీలలాగే వ్యవహరించిన తీరు ఉపాధ్యాయులు, అధ్యాపకులు గ్రాడ్యుయేట్లు ప్రలోభాలకు లొంగి ఓటు వేసిన తీరు చూస్తుంటే రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయనిపిస్తుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలి తాలలో యూటీఎఫ్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతే బలమైన ఉపాధ్యాయ సంఘం పీఆర్‌టీయూ ఒకచోట తన సిట్టింగ్ స్థానా న్ని కోల్పోయి మరొకచోట విజయం సాధించింది. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఒక ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ స్థానాన్ని కైవసం చేసుకుని బీజేపీ తన రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే పోటీ చేసిన ఒక్క గ్రాడ్యుయేట్ సిటింగ్ స్థానాన్ని కోల్పోయి అధికార కాంగ్రెస్ పార్టీ డీలాపడిందనే చెప్పాలి.
కమలానికి కలిసి వచ్చిన ఫలితాలు
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఒక విధంగా తన సత్తా చాటిందనే చెప్పా లి. మూడు ఎమ్మెల్సీలకు జరిగిన ఎన్నికలలో కరీంనగర్, అదిలాబాద్, నిజామా బాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలుచుకొని మరొకసారి బీజేపీ ఉత్తర తెలంగాణపై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుందనే చెప్పాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీని పీఆర్‌టీయూ నుండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీ నుండి కైవసం చేసుకొని రాజకీయం గా బీజేపీ తన సత్తా చాటింది.
బలమైన అభ్యర్థులను ఎంపికచేయటంతో పాటు వ్యూహాత్మకంగా ప్రచారం చేయడంతో ఈ రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగలిగింది. ఈ నాలుగు జిల్లాలలో బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహించటం, ఆ పార్టీ గెలిచిన 8 మంది శాసన సభ్యులలో ఏడుగురు ఈ జిల్లాల నుండే ప్రాతినిధ్యం వహించటం బీజేపీ విజయానికి కలిసి వచ్చింది.
ఈ నాలుగు జిల్లాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్‌పై పట్టుని పెంచుకోగలిగితే తెలంగాణలో కూడా బీజేపీ ఒక బల మైన రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం లేకపోలేదు. ఈ విజయంతో భారతీయ జన తా పార్టీ ఆరు లోక్‌సభ స్థానాలలో, 42 శాసనసభ స్థానాలలో బలం పుంజుకోవటానికి అవకాశం దొరికింది.
కాంగ్రెస్ వైఫల్యం
అధికార కాంగ్రెస్ పార్టీ మూడు ఎమ్మె ల్సీ స్థానాలలో ఒకే ఒక్క గ్రాడ్యుయేట్ స్థానంలో మాత్రమే పోటీ చేసింది కానీ మిగతా రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలలో పోటీ చేయలేదు. అధికారికం గా ఎవరికీ మద్దతు కూడా ఇవ్వలేదు తాను పోటీ చేసిన సిట్టింగ్ గ్రాడ్యుయేట్ స్థానంలో కూడా ఫలితం ప్రతికూలంగా రావటం కాంగ్రెస్ వైఫల్యంగానే చూడాలి. కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో కైవసం చేసుకున్నారు.
కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేసినా బీజేపీ చేతిలో ఓడిపోవడంతో కాంగ్రెస్‌కు రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతా యి. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి స్వయంకృతాపరాధంగా నే కనపడుతోంది. సరైన అభ్యర్థిని ఎంపికలోనూ, కలిసికట్టుగా పార్టీ అభ్యర్థి విజ యానికి పనిచేయకపోవటం కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి న ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ ఓట్లనే భారీ గా చీల్చడంతోఆ పార్టీకి నష్టం జరిగింది. జీవన్‌రెడ్డిలాంటి బలమైన అభ్యర్థిని నిలపటంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఓటమికి దారితీసింది. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి ఆ పార్టీకి నష్టం చేసే విధం గానే ఉన్నది.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రె స్ నాయకుడు స్వతంత్రంగా పోటీ చేసినా నిలువరించలేకపోవటం, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌కు స్పష్టమైన వైఖరి లేకపోవటాన్ని అనుకూలంగా మలుచుకొని బీజేపీ విజయం సాధించటం హస్తం పార్టీ వ్యూహాత్మక తప్పిదంగానే చూడాలి.
బీఆర్‌ఎస్ పార్టీ ప్లాన్ ఏలో భాగంగా ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయటం, ప్లాన్ బీలో భాగంగా రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీ అభ్యర్థికి వేసి కాంగ్రెస్ అభ్యర్థి విజయాన్ని అడ్డుకోవటంలో విజయం సాధిం చిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుండి వ్యక్తమవుతోంది.
బీసీ వాదం బలం ఎంత?
ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ వాదం అనూహ్యంగా తెరపైకి వచ్చిందనే చెప్పాలి. బీజేపీ నుంచి కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసిన బీసీ అభ్యర్థి గెలుపొందటం, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మె ల్సీకి క్యాడర్ లేని బీఎస్పీ బలపరిచిన బీసీ అభ్యర్థి రెండు బలమైన పార్టీలను ఎదుర్కొని 61 వేలకుపైగా మొదటి ప్రాధాన్యతా ఓట్లు రాబట్టటాన్ని ఎలా చూడాలి?
బీసీ వాదం మొదటిసారి ఎన్నికల అజెండాగా మారటం, బీసీ అభ్యర్థులకు ఓట్లు గణనీయంగా రావడం రాజకీయ పార్టీలను ఆలోచనలో పడవేసిందనే చెప్పాలి. మూడు ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ వాదం బలంగా వినపడటం భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు సంకేతంగా భావించాలి.
ఎన్నికల ఫలితాలు బీసీలు ఆశించిన స్థాయిలో లేకపోవచ్చు కానీ రాజకీయాల లో బీసీవాదం బలమైన శక్తిగా ఎదగడాని కి ఈ ఎన్నికలు బీజం వేశాయనే చెప్పాలి. బీసీ అభ్యర్థులు మరిన్ని మెరుగైన ఫలితా లు, ఓట్లు సాధించే అవకాశం ఉన్నా బీసీ సంఘాలు వ్యవహరించిన తీరు, స్వార్థపూరిత తప్పిదాల వలన కొంత వెనుకబడిం దనే చెప్పాలి.
నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఎన్నికలలో ఒకే ఉమ్మడి బీసీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంలో బీసీ సంఘాలు గందరగోళానికి గురైనాయి. బీసీల కోసం మేమే పోరాడుతున్నామని ఛాంపియన్స్‌గా ప్రకటించుకున్న వాళ్ల అపరిపక్వ వైఖరి బీసీ అభ్యర్థులపై మిగతా వర్గాలలో ద్వేషాన్ని పెంచింది. ‘మీ ఓట్లు మాకు వద్దు’ అనే ప్రకటన చాలా నష్టం చేసింది. భవిష్యత్తులోనైనా బలమైన రాజకీయ ఎత్తుగడలు లేకపోతే బీసీ వాదానికి నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదు.
స్థానిక ఎన్నికలపై ప్రభావం
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉంది. ఒక వర్గం ఓట్లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలతో మొత్తం రాజ కీయ పరిణామాలు మారతాయని భావించలేం కానీ ఈ ఫలితాలు ‘మూడ్ ఆఫ్ ది స్టేట్’ని అంచనా వేయటానికి దోహద పడతాయి. తెలంగాణలో బీజేపీ బలపడుతోం దనే అభిప్రాయానికి ఈ ఫలితాలు బలం చేకూర్చేలా ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాలలో మాకు బలం ఉంది సాధారణ ఎన్ని కల నాటికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య చీలి మళ్లీ మేమే గెలు స్తాం, ఈ ఒక్క ఓటమితో మా ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని అధికార పార్టీ భావిస్తే భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు, ఆ పార్టీకి జరిగే నష్టానికి ఆ పార్టీదే బాధ్యత.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ రాష్ట్ర పర్యటనలో ఉన్న సందర్భంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రతికూ లంగా రావటం కాంగ్రెస్‌కు ఇబ్బందికరమైన పరిణామమే. తెలంగాణ రాజకీయ చదరంగంలో గెలుపు కోసం అన్ని పార్టీలు అన్ని దారులను వెతుక్కున్నట్లుగానే కనిపిస్తుంది. ఎన్నికల గోదాలోకి దించి గెలవడా నికి చేసిన ప్రయత్నాలు రాజ్యాంగ, ప్రజాస్వామిక స్ఫూర్తిని దెబ్బతీశాయి.
టి వ్యాసకర్త సెల్ : 9885465877






