విధాన రూపకల్పనలో భాగస్వామి కావాలి!
సమాజంలో స్త్రీ వివక్షకు గురైందన్న విషయంలో ఎవరికీ సందేహం ఉండనవస రం లేదు. స్త్రీ అన్ని రంగాలలో పురుషులకన్నా మి న్నగా రాణిస్తున్నప్పటికీ తనపట్ల చులకన భావం నుంచి సమాజం బయటపడ లేదని చెప్పొచ్చు. మార్పు రావాలంటే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. పిల్లలకు పాఠశాల దశనుంచి స్త్రీపట్ల చైతన్యవంతమైన దృక్పథం అలవాటు పడాలి. పాఠ్యపుస్తకాలోనూ స్త్రీ సంబంధిత అంశాలను చేర్చాలి. చిన్నారుల మనసులను పసితనం నుంచే స్ఫూర్తిదాయంగా మార్చాలి. అప్పుడే లైంగిక వేధింపులకు అడ్డుకట్ట పడుతుంది. కానీ, ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. దృక్పథంలో మార్పు అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. స్త్రీలమీద జరిగే దాడుల విషయం లో సత్వర న్యాయం జరిగేలా చూడాలి.
మహిళలను రక్షించడం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులతోపాటు అనేక చట్టాలు చేశా రు. ఆధునిక స్త్రీ అన్ని రంగాలలో పురుషులకన్నా మించి రాణిస్తున్నదనడంలో సందేహం లేదు. మహిళలు, విద్యార్థినిలు లైంగిక వేధింపులకు, అత్యాచార, గృహహింస, వరకట్న వేధింపులవల్ల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.
సమున్నత ప్రాతినిధ్యం లభించాలి
ఈ సృష్టికి మూలమైన స్త్రీ వివిధ మానవ సం బంధాలలో ఒక అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్య గా ఇంకా ఒక దేవతగా పూజించే సంస్కృతి మనది. పని ప్రదేశంలో ఉండి అక్కడ బాధ్యతలు పురుషులతో సమానంగా నిర్వహిస్తూ కూడా రేపటి పౌరులను, అంటే తన పిల్లలను గురించి ఆలోచించ టం అంటే అది సమాజసేవ కాదా? అది దేశసేవ కిందికి రాదా? ఆ పిల్లలే కదా, రేపు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అయ్యేది. మహిళల సమస్యలను పురుషులు కొంతవరకే అర్థం చేసుకోగలరు. ప్రకృతి పరంగా స్త్రీకి ఉన్న సమస్యలు స్త్రీలకు మాత్రమే అర్థమవుతాయి. మరి ఆ సమస్యల పరిష్కారానికి చేసే విధాన రూపకల్పన ప్రక్రియలో స్త్రీలకు స్థానం ఉండాలా? లేదా? దీన్నే ప్రజా జీవితంలో స్త్రీకి సమున్నత ప్రాతినిధ్యం ధైర్యంగా ఇవ్వడమని అంటారు.
అంటే, పరిపాలనకు రూపకల్పన చేసి చట్టసభల్లో స్త్రీలకు జనాభాలో వారి నిష్పత్తి ప్రకారం తగిన ప్రాతినిధ్యం లేదు. నేడు మహిళలు ఆత్మవిశ్వాసంతో బ్యాంకు మెట్లు ఎక్కుతున్నారు. అధికారులతో ధైర్యంగా మాట్లాడు తున్నారు. ఇది సమాజానికి శ్రేయస్క రం. ఆ దిశగా స్త్రీలు పయనించడానికి, విధాన రూపకల్పనలో భాగస్వామ్యం పొందడానికి కుటుంబ, సమాజ పరంగా అనువైన వాతావరణం కల్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిమీద ఉంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మహిళా దినోత్సవం వేడుక పరిపూర్ణమైనట్టే.
-లకావత్ చిరంజీవి






