07-05-2025 12:00:00 AM
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): అప్పు పుట్టడం లేదని సీఎ ం రేవంత్ మాట్లాడటం చూస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎత్తేసే యో చనలో ఉన్నట్టుగా అనిపిస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చురకలంటించారు. మంగళవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయ న మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీలతో పాటు సంక్షేమ పథకాలు ఎత్తేసేందుకు ప్రజలను సంసి ద్ధం చేస్తున్నారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి అప్పు గురించి తెలియదా అని ప్రశ్నించారు.