calender_icon.png 8 May, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిచ్కుంద మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు వైద్యశిబిరం

07-05-2025 12:00:00 AM

పెద్దకొడప్గల్ మే 6: కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని జగన్నాథ్ పల్లి గ్రామంలో బిచ్కుంద మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గాలికుంటు 350 టీకాలు 30 లేగ దూడలకు నట్టల మందు 18 గర్భకోష చికిత్సలు చేయడం జరిగిందని తెలిపారు.

ఏ ఎం సి చైర్మన్, కవితా ప్రభాకర్ రెడ్డి, ఏ ఎం సి డైరెక్టర్, నాగనాథ్ పటేల్ శ్రీహరి, పెద్ద కొడప్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు, డాక్టర్ సంజీవ్ కుమార్, మరియు పెద్ద కొడప్గల్ పశు వైద్యాధికారి, డాక్టర్ మనీ, గోపాలమిత్ర వైద్య సిబ్బంది, కల్లూరి రవీందర్ మరియు నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు