calender_icon.png 2 August, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల హామీల్ని తుంగలో తొక్కిన రాష్ట్ర ప్రభుత్వం

01-08-2025 01:03:36 AM

మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 

బెల్లంపల్లి అర్బన్, జూలై 31 : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కిందని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నా రు. బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాలోని బిఆర్‌ఎస్ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హామీలతో మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిన రేవంత్ రెడ్డి ప్రజలను మోసగించాడనీ విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయం లో ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలని ధ్వజమెత్తారు. అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన రేవంత్ పాలన ఎంతోకాలం ఉండదన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన అనేక పథకాలను రేవంత్ ప్రభుత్వం నీరుగార్చి రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు.

రాష్ట్రవ్యా ప్తంగా ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వంపైన వ్యతిరేకత మొదలయ్యిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్ ను ఆదరిస్తారని  ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్  సైనికులందరూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై  పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్య లు పరిష్కారం అయ్యే వరకూ పోరాటం చేయాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది మన బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతీ ఒక్కరికీ రానున్న కాలంలో పార్టీ పరంగా మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గం పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ  అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్యనాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.