01-08-2025 01:05:21 AM
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
నిర్మల్, జూలై 31 (విజయక్రాంతి): ప్రజ ల అభివృద్ధి సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేయడం వలనే మారుమూల పెంబి మండలంలో సంపూర్ణ అభియాన్ సన్మాన్ కార్యక్ర మం విజయవంతమైందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో సంపూర్ణ అభియాన్ కార్యక్రమం విజయవంతం చేసిన అధికారులకు సన్మానం చేసి ప్రశంస పత్రాలను అంద జేశారు.
మారుమూల పెంబి మండలంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు రక్త పరీక్ష లు ప్రజల ఆరోగ్యం గర్భిణీలకు పోషకాహారం వైద్యం వంటి కార్యక్రమాలు అమలు చేయడం కేంద్ర ప్రభుత్వం గుర్తించి కోటి రూపాయల నిధులను అందించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువైనప్పుడు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారని అది అం దించవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులపై ఉందని గుర్తు చేస్తారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు వివిధ ఉత్పత్తుల స్టాళ్లను ఏర్పాటు చేయగా కలెక్టర్ ఎమ్మెల్యే వాటిని సందర్శించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అదన కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి అంబాజీనాయక్ డిపిఓ శ్రీనివాస్ వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్ లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్ పరిశ్రమల శాఖ అధికారి నర్సింహారెడ్డి విద్యాశాఖ అధికారి రామారావు మున్సిపల్ కమిష నర్ జగదీశ్వర్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.