calender_icon.png 10 February, 2026 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల కమిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి

10-02-2026 01:50:37 AM

  1. బీజేపీకి భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ఈనెల 10, 11న ఎన్నికల ప్రచారం లేకున్నా, దినపత్రికల్లో పేపర్ ప్రకటనలను ఇచ్చుకునే నిబంధన ఉన్నాగానీ, రాష్ట్ర ప్రభు త్వం ఒత్తిడి మేరకు ఎన్నికల కమిషన్ దాన్ని నిలిపివేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ప్రచార ప్రకటనలకు తొలుత క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత చివరి నిమిషంలో అడ్వర్టుజ్‌మెంట్ ఇచ్చుకోవద్దని ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు.

ఈమేరకు సోమవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. కేవలం బీజేపీ అన్ని పేపర్లను బ్లాక్ చేసినందుకే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మీద ఎన్నికల కమిషన్ ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ స్వచ్ఛందంగా పనిచేయాలని, దానిపై ఒత్తిడి తేవొద్దని పేర్కొన్నారు. బీజేపీకి భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా అడ్డుకుంటుందని, దీనిపైన న్యాయపరమైన పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు.