calender_icon.png 14 July, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముద్దు సీన్ డిలీట్ చేస్తారా! అసలు వాళ్ల ఉద్దేశమేంటో?

13-07-2025 01:02:01 AM

శ్రేయా ధన్వంతరి.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘గన్స్ అండ్ గులాబ్స్’ వంటి వెబ్‌సిరీస్‌ల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఉన్నట్టుండీ సెన్సార్ బోర్డు చర్యలను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. డీసీ యూనివర్స్‌లో సూపర్ మ్యాన్ సిరీస్ సినిమాలెన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ యూనివర్స్‌లోని సినిమా ఫ్రాంచైజీలకు కొత్త వెర్షన్‌గా రూపొందిన తాజాచిత్రం ‘సూపర్ మ్యాన్’.

డేవిడ్ కొరెన్స్ వెట్- రెచెల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. అయితే, ఇందులోని ఓ సీన్‌ను సెన్సార్ డిలీట్ చేయడం శ్రేయా ధన్వంతరికి ఆగ్ర హం తెప్పించింది. ఈ చిత్రంలో 33 సెకన్ల ముద్దు సన్నివేశాన్ని సెన్సార్ బోర్డు తొలగించడాన్ని ఆమె తప్పపట్టింది. ఈ విషయమై శ్రేయా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ షేర్ చేసింది. “సూపర్ మ్యాన్’లో 33 సెకన్ల కిస్ సీన్‌ను సెన్సార్ తీసేసిం ది. ఇదేం చర్య. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలనే సెన్సార్ వాళ్లు కోరుకుంటారు.. పైరసీలను ప్రోత్సహించవద్దనీ చెప్తారు.

కానీ, బోర్డు వాళ్లు మాత్రం ఇలాంటి అర్థం లేని పనులు చేస్తారు. అసలు వాళ్ల ఉద్దే శం ఏంటో నాకస్సలు అర్థమవ్వడంలేదు. ఇలాంటివి చేస్తూనే థియేటర్‌లో సిని మా చూడాల్సిన అనుభూతిని దెబ్బతీస్తున్నారు. సినిమా చూసే ప్రేక్షకులకు స్వేచ్ఛనివ్వాలి. మా డబ్బులు, సమయం వెచ్చించి మేం ఏం చూడాలి అనుకుం టున్నామో మమ్మల్ని నిర్ణయించుకోనివ్వండి. ఇదొక హాస్యాస్పద మైన చర్య. సినిమా చూసేందుకు థియేటర్ అనేది ఉత్తమమైన మార్గం. ప్రేక్షకులను చిన్న పిల్లల్లా భావించి, థియేటర్ లో చూశామన్న ఫీలింగ్ కలగకుండా చేస్తున్నారు” అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది శ్రేయా.