6 May, 2026 | 2:20 AM

ఇన్నోసెంట్ ఆటోడ్రైవర్ కథ!

06-05-2026 12:57 AM

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ నుంచి వస్తున్న తాజాచిత్రం ‘గోదారి గట్టుపైన’. దర్శకుడు సుభాష్ చంద్ర దీన్ని రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు. రెడ్ పప్పె ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో నిధి ప్రదీప్ కథానాయికగా నటించగా, జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. మే 8న విడుదలవుతున్న ఈ సినిమా విశేషాలను  సుమంత్ ప్రభాస్ విలేకరులతో పంచుకున్నారు. 

నా అసలు పేరు సుమంత్. అప్పట్లో ఫేస్‌బుక్‌లో ఫేవరేట్ హీరో పేరును యాడ్ చేసే ట్రెండ్ ఉండేది. అలా ‘సుమంత్ ప్రభాస్’ అని పెట్టుకున్నా. అదే కంటిన్యూ అయింది (నవ్వుతూ). 

* ‘మేము ఫేమస్’ తర్వాత మంచి కథ కోసం వెతుకుతుంటే కొంత ఒత్తిడి పెరిగేది. కథను, భావోద్వేగాలను కొత్తగా చెప్పే మేకర్ కోసం చూస్తుంటే సుభాష్ కలిశారు. షార్ట్ ఫిలిమ్స్ సినిమా స్టయిల్లోనే తీసే ఆయన చెప్పిన ఈ గోదారి కథ అంటే నాకు ఛాలెంజింగ్ అనిపించింది. నటనకు మంచి స్కోప్ దొరికింది.

‘మేము ఫేమస్’ యూత్ తెలంగాణ పల్లె కథ. ‘గోదారి గట్టుపైన’ గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సూపర్ క్యూట్ ఫిల్మ్. జగపతిబాబుది మెయిన్ క్యారెక్టర్. ఆయన ‘శుభలగ్నం’, ‘ఫ్యామిలీ సర్కస్’ సినిమాల్లా అందరూ రిలేట్ అయ్యే సూపర్ క్యూట్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. మామధ్య జరిగే సన్నివే శాలు ఆకట్టుకునేలా ఉంటాయి. లవ్, ఫాదర్ ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకుం టాయి.  

* ఆటో డ్రైవర్ అంటే సాధారణంగా మాస్ క్యారెక్టర్‌గా చూపిస్తారు. కానీ ఆటో డ్రైవర్లు చాలా ఇన్నోసెంట్, క్యూట్‌గా కూడా ఉంటా రు. ఇందులో నా క్యారెక్టర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి విలువ ఇచ్చే పాత్ర. ఇందులోని ఆటో రేస్ కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాను.   

* నేను కూడా డైరెక్షన్ చేసినవాణ్నే కానీ, సుభాష్‌కు సలహాలు ఇవ్వలేదు. ఆయన స్టయిల్లోనే ప్రెజెంట్ చేయాలనుకున్నారు. కథ వినగానే ఆయనకు పూర్తిగా సరెండర్ అయ్యా ను. ప్రమోషన్స్ మాత్రం నాకు వదిలేయండి అన్నాను (నవ్వుతూ). 

డైరెక్టర్ సాయిలు కంపాటి నాకు చెప్పిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథ చాలా నచ్చింది. కానీ అప్పటికే ‘మేము ఫేమస్’ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో చేశాను. మళ్లీ అదే చేస్తే రిపీట్ ఫీలిం గ్ వస్తుందని చేయనని చెప్పేశా. ఆ కథ అఖిల్ చేశాడు.. అతనికి హెల్ప్ అయ్యింది. ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ వచ్చింది. 

* నేను పుట్టి పెరిగింది తెలంగాణలో. గోదారి యాస కోసం దాదాపు నాలుగు నెలలు రిహార్సల్స్ చేశాను. అక్కడ పుట్టి పెరిగిన వారు విన్నప్పుడు ఖచ్చితంగా మనలాగే మాట్లాడుతున్నాడనే ఫీలింగ్ రావాలని ప్రయత్నించాను. 

* సినిమాలో జగపతిబాబు, నిధి పాత్రలు చాలా బలంగా ఉంటాయి. వారి ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా ఉంటాయి. నిధి తెలు గు చాలా బాగా నేర్చుకుని అద్భుతంగా చేసిం ది. జగపతిబాబు, లైలా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి ఫ్యామిలీ వైబ్ వుంటుంది. 

* ఇక నా కొత్త ప్రాజెక్టుల గురించి చెప్పాలంటే.. ప్రస్తుతానికి ఒక సినిమా పూర్తయింది. త్వరలో వివరాలు తెలియజేస్తారు. ఇకపై గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నా.