calender_icon.png 20 October, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం

18-10-2025 01:37:07 AM

ఏఐసీసీ కార్యదర్శి జరిత

జహీరాబాద్, అక్టోబరు 17 : కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని ఏఐసిసి కార్యదర్శి జరితా అన్నారు. కార్యకర్తలు,  నాయకులు కలిసి పనిచేసిన నాడే పార్టీకి విజయం లభిస్తుందని ఆమె తెలిపారు. శుక్రవారం నాడు జహీరాబాద్ పట్టణంలోని ఎస్ వి ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ సంఘటన్ శ్రీ జన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లే బాధ్యత కార్యకర్తలది అని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, టి ఎస్ ఐ సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఖండియం నర్సింలు మాజీ ఎంపీటీసీలు మాజీ జడ్పీటీసీలు పార్టీ మండలాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.