18-10-2025 01:38:42 AM
-రసమయి ఫామ్ హౌస్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ శ్రేణులు
-ముట్టడిని అడ్డుకున్న పోలీసులు
సిద్దిపేట,అక్టోబర్ ; మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బెజ్జం కి మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం బెజ్జంకి మండలంలోని గుండారంలో రసమయి ఫామ్ హౌస్ను బెజ్జంకి, ఇల్లంతకుంట, గన్నేరువరం, తిమ్మాపూర్ మండలాల కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న ఏసీపీ రవీందర్ రెడ్డి ,ఎస్‌ఐ సౌజన్య పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకుని బెజ్జంకి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
వారిలో కాంగ్రెస్ నాయకులు బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, మానకొండూరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రసాద్, డైరెక్టర్లు వీరేశం వీరేశం సురేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ జెట్టి మల్లేశం, సోషల్ మీడియా అధ్యక్షుడు కాసుపాక రమేష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు షాదీక్ ఉన్నారు._
మాజీ ఎమ్మెల్యే రసమయి దిష్టిబొమ్మ దహనం
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎడ్ల బండి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు రసమయి దిష్టిబొమ్మలను దహనం చేశారు. వెంటనే ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువజనాయకులు పాల్గొన్నారు.