calender_icon.png 13 May, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జవాన్‌కు నివాళి

09-05-2025 12:40:46 AM

అర్మూర్, మే 8 (విజయక్రాంతి) :  జమ్మూకాశ్మీర్లో జరిగిన సీజ్ ఫైర్ కాల్పులలో వీరమరణం పొందిన మద్నూర్ మండల కేంద్రం దెగ్లూర్  కు చెందిన సచిన్ యాదవ్ వనండే ఆర్మూర్ న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు.

ఆయన మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి  భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ నివాళులర్పించారు. అదేవిధంగా ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసి పాకిస్థాన్ కు దిమ్మదిరిగిన సమాధానాన్ని, కోలుకోలేని దెబ్బను కొట్టిన  సైనికులకు, భారత ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఆర్మూర్ ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు గటడి ఆనంద్, కోశాధికారి చైతన్య, మాజీ అధ్యక్షుడు పండిత్ కృష్ణ, ఎంకె నరేందర్, చిలుక కిష్టయ్య, విప్లవ్ కిరణ్, తెడ్డు నర్సయ్య, న్యాయవాదులు ఆవారి రమేష్, ఆవుల అశోక్, కీర్తి సాగర్, ఖాందేశ్ సంగీత, ఐనారి అశోక్, షిండే,   వై.గణేష్, రాము, సంజీవ్, శ్రీకర్, రాకేష్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.