calender_icon.png 11 July, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పొంగుతున్న గోదావరి

10-07-2025 06:34:59 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాలేశ్వరంలో గోదావరి(Godavari River) ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహించడంతో గోదావరికి వరద పోటెత్తింది, సరస్వతి పుష్కరాల ఘాటు వద్ద గోదావరి నది ఉధృతంగా పవి ప్రవహిస్తున్నది, మెట్లు మునిగిపోయి, సరస్వతి పుష్కరాల అప్పుడు ఏర్పాటు చేసిన జ్ఞానబండాగారాలు గ్రంథాల మీదుగా ప్రవహిస్తున్నది. గోదావరి నది ఒప్పోంగి ప్రవహించడంతో దిగువన ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజ్) 85 గేట్లు ఎత్తి నీటిని దిగకు వదులుతున్నారు. 6 లక్షల 36 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం రాగా అంతే ప్రవాహాన్ని మేడిగడ్డ బ్యారేజీ దిగువకు వదులుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తగా ఉండాలని తాసిల్దార్ రామారావు కోరారు.