calender_icon.png 25 May, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగులోకి డేంజర్ బాయ్స్

25-05-2025 12:00:00 AM

న్నడలో అనూహ్య విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపించిన ‘అపాయవీడి హెచ్చరిక’ చిత్రం ‘డేంజర్ బాయ్స్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యశశ్విని క్రియేషన్స్, గీతా ఫిలిమ్స్ పతాకాలపై జీవీ మంజునాథ్ పూర్ణిమ ఎం గౌడ్ నిర్మించిన ఈ చిత్రానికి అభిజిత్ తీర్ధహళ్లి రచనా-దర్శకత్వం వహించారు.

వికాస్ ఉత్తయ్య, రాధా భగవతి, అశ్విన్ హసన్, రాఘవ్ కొడబాద్రి, మిథున్ తీర్ధహళ్లి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు సునాద్ గౌతమ్ మ్యూజిక్ అందిస్తూ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. జూన్ ద్వితీయార్ధంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

‘దండుపాళ్యం, కాంతారా తదితర చిత్రాల కోవలో కన్నడలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగులోనూ అదే స్థాయి విజయాన్ని అందుకో వడం ఖాయమని చిత్ర సమర్పకుడు దర్శకనిర్మాత శ్రీరంగం సతీశ్‌కుమార్ పేర్కొన్నారు.