16 August, 2026 | 5:48 AM

బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలి

24-04-2026 01:37 AM

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఒడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ హన్మత రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు.

ఉపాధ్యాయులకు జీరో సర్వీస్ ఆధారంగా బదిలీ అవకాశం కల్పించాలని కోరారు. జనగణన విధుల్లో ఉన్న వారికి కూడా అవకాశమిచ్చి తర్వాత వారికి బదిలీ అవకాశం కల్పించాలన్నారు. బదిలీలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఖాళీల జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు.