నకిలీ టీ పొడి తయారీ ముఠా అరెస్ట్
టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
సికింద్రాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున నకిలీ టీ పొడి కల్తీ జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో, హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ నగరవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించింది. కల్తీ టీ పొడిని తయారుచేస్తూ, విక్రయిస్తున్న తయా రీ కేంద్రాలే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
అధిక లాభాల కోసం నిందితులు తక్కువ నాణ్యత గల టీ పొడికి కృత్రిమ రంగులు గడువు ముగిసిన ముడి పదార్థాలను కలిపి వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కల్తీ పొడిని రోడ్డు పక్కన ఉండే టీ స్టాళ్లతో పాటు కొన్ని ప్రముఖ విక్రయశాలలకు కూడా సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశా రు.
వీరిలో కొంపల్లికి చెందిన పరేశ్ రాజన్ (రంగుల సరఫరాదారు), పెట్లాబుర్జుకు చెందిన సంజు అలియాస్ పతి (రంగులు కలిపే వ్యక్తి), ముషీరాబాద్కు చెందిన సతీష్, బోయిన్ పల్లికి చెందిన నవీ న్, ఆసిఫ్ నగర్‌కు చెందిన నరసింహ (250 గ్రాముల ఇల్లీగల్ ప్యాకెట్ల తయారీదారు), రాజేంద్రనగర్‌కు చెందిన చున్నిలాల్ చౌదరి, బోరబండ కు చెందిన నరసింహులు, పెట్లాబుర్జుకు చెందిన రాజేష్, బీదర్కు చెందిన రవీందర్ మరియు మల్లేపల్లికి చెందిన వసీం ఉన్నారు.
వీరంతా రంగులు కలపడం, ప్యాకేజింగ్ మరియు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం నిందితులు కోల్క తా, కేరళ, అస్సాం వంటి రాష్ట్రాల నుండి తక్కువ నాణ్యత గల టీ పొడిని సేకరించి, దానికి ఆకర్షణీయమైన రంగు రావడానికి సన్సెట్ ఎల్లో, టార్ట్రాజైన్ వంటి హానికరమైన రంగులతో పాటు బెల్లం పాకం, వాడేసిన టీ పొడి మరియు ఎక్స్పైరీ అయిన టీ పొడిని కలుపుతున్నారు.
ఈ హానికరమైన మిశ్రమాలను ప్రసిద్ధ బ్రాండ్ల పేరుతో రీ-ప్యాకేజింగ్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. ఇటువంటి కల్తీ టీ పొడి సేవించడం వల్ల కడుపు సంబంధిత వ్యాధు లు, అలర్జీలు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ దాడుల్లో సుమారు 3,000 కిలోల కల్తీ టీ పొడి, 1500 కిలోల ఎక్స్‌పైరీ టీ పొడి, 100 కిలోల బెల్లం మరియు భారీగా కృత్రిమ రంగులను సీజ్ చేశారు.






