16 August, 2026 | 1:00 AM

బెస్ట్ మెడికల్ ఆఫీసర్‌గా మనోజ్‌రెడ్డి

16-08-2026 12:00 AM

ముషీరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): ముషీరాబాద్ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేం ద్రం (యూపీహెచ్సీ) వైద్యాధికారి డాక్టర్ మనోజ్ రెడ్డి జిల్లాస్థాయిలో బెస్ట్ మెడికల్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. ఆయనకు శనివారం జిల్లా కలెక్టర్ ప్రియాంకా అలా ప్రశంశాపత్రం, మెమోం టోను అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నందుకు జిల్లా స్థాయిలో 7సార్లు ఉత్తమ వైద్యాధికారిగా అవార్డులు అందుకున్నానని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నాకు ఈ అవార్డు రావడం మరింత ఆనందంగా ఉందని పేర్కొన్నారు.