24 April, 2026 | 1:52 AM

దాతల సౌజన్యంతో బలోపేతమవుతున్న ట్రస్ట్ అన్నదాన సేవలు

24-04-2026 12:00 AM

ఆదర్శంగా నిలుస్తున్న ‘మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్’

వేములవాడ, ఏప్రిల్ 23,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణానికి చెందిన మై వేములవాడ ట్రస్టు ఆధ్వర్యంలో గత 1829 రోజులుగా నిరంతరంగా కొనసాగుతున్న అన్నదాన సేవా కార్యక్ర మం గురువారం కూడా కొనసాగింది. రాజన్న ఆలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది అన్నార్థులు, భక్తులకు భోజనం ఏర్పాటు చేశారు.గురువారం అన్నదాతలుగా గంభీరావుపేటకు చెందిన చిన్నారి బోగన్నగారి లాశ్విత పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లిదండ్రులు నరేష్‌అనన్య దంపతులు, గోదావరిఖని వాస్తవ్యులు చిన్నారి గోలి జోషిక పుట్టినరోజు సందర్భంగా గణేష్‌సిరిచందన దంపతులు,

ముస్తాబాద్కు చెందిన ముత్యాల సునీత ప్రభాకర్ దంపతులు తమ పెళ్లిరోజు సందర్భంగా అన్నదానానికి సహకారం అందించారు.అలాగే శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వర రావుస్నేహాలత దంపతులు, ప్రతాపస్వప్నసంపత్ దంపతులు, నగుబోతు రవీందర్‌జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజసాంబశివు దంపతులు, దేవరాజు ఉమబాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత కుటుంబ సభ్యులు ప్రజ్ఞశరత్ చంద్ర,

శిరీషసాయిచంద్ర, శర్వాణిరవిచంద్ర దంపతులు, హైదరాబాద్కు చెందిన చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ మధు మహేష్ మాట్లాడుతూ, తమ పుట్టినరోజులు, పెళ్లిరోజులు వంటి సందర్భాల్లో పేదలకు ఒక్కపూట భోజనం అందించాలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు డాక్టర్ బెజ్జంకి రవీందర్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, వొడ్యాల వేణు, నాగుల చంద్రశేఖర్, ప్రతాప నటరాజు, నక్క వేణు, పొలాస రాజేందర్, సగ్గు రాహుల్, పసుల శ్రీనివాస్, మఠం శివకుమార్, మధు కవిత తదితరులు పాల్గొన్నారు.