24 April, 2026 | 1:51 AM

నీటి బకెట్లో పడి చిన్నారి మృతి

24-04-2026 12:00 AM

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 23 ( విజయక్రాంతి ): తల్లితో కలిసి బోసినవ్వుల్తో ఇంట్లో గేంతులేస్తూ సందడి చేసిన చిన్నారి ఆడుకుంటూ వెళ్లి క్షణాల్లోనే నీటి బకెట్ లో పడి మృతి చెందిన విషాద సంఘటన లింగాల మండల పరిధిలోని అప్పాయిపల్లిలో గురువారం చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళ్లితే నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పయ్యపల్లి గ్రామానికి చెందిన చింతకుంట మల్లేష్, విజయ దంపతుల కుమార్తె మీనాక్షి (2). గురువారం మధ్యాహ్నం తల్లి విజయ చిన్నారికి స్నానం చేయించేందుకు బాత్రూమ్లో బకెట్లో నీరు నింపి, సబ్బు తీసుకురావడానికి షాప్ కు వెళ్లింది.

తల్లిని వెతుక్కుంటూ బాత్రూం వద్దకు వెళ్లిన మీనాక్షి నీటి బకెట్లో పడి ఊపిరాడక మృతి చెందింది. షాపు నుంచి తిరిగి వచ్చిన తల్లి ఇంట్లో వెతుక్కుంటూ బాత్రూం వద్దకు వెళ్లగా చిన్నారి బకెట్లో విగతజీవి కానించగా తల్లి వెంటనే బయటకు తీసింది. కాగా అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.