పోలీసుల ముందే కొట్టుకున్న ఇరువర్గాలు
24-03-2026 01:13 AM
సదాశివపేట, మార్చి 23: పోలీసులంటే భయపడే రోజుల నుండి ఖాకీల ముందే కొట్టుకున్న వైనం సదాశివపేట పోలీస్ స్టేషన్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... సదాశివపేట మండలం మద్దికుంట గ్రామానికి చెందిన తండావాసులు ఒక కేసు నిమిత్తం సదాశివపేట పోలీస్ స్టేషన్ కు రాగా పోలీసులు కేసు విషయంలో రాజీ పడాలని సూచించడంతో వినకుండా బయటకి వచ్చిన ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ ముందే పిడిగుద్దులతో కొట్టుకున్నారు.
అయితే ఈ విషయంలో పోలీసులు వారిని నియంత్రించలేక చూస్తూ ఉండిపోయారు. స్థానికులు మాత్రం పోలీస్ స్టేషన్ ముందే ఇలా ఉంటే బయట పరిస్థితి ఎలా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. గొడవ విషయం పోలీసులను అడగగా తమకు ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదని చెప్పారు.




