24-12-2025 12:00:00 AM
కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
నిజామాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే రానున్న రోజుల్లో జరుగనున్న ఎం.పీ.టీ.సీ, జెడ్.పీ. టీ.సీ ఎన్నికలను కూడా సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వి నయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికలను విజయవంతం గా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో ఎం.పీ.డీ.ఓలు, ఎం.పీ.ఓలు సక్సెస్ మీట్ నిర్వహించారు.
జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తూ, ఎన్నిక ల విధుల నిర్వహణ పట్ల ప్రతి దశలోనూ అధికారులు మొదలుకుని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరికీ తగిన సలహాలు, సూచనలు అంది స్తూ జిల్లాలో ఎన్నికలను సజావుగా జరిగేలా కృషి చేసిన కలెక్టర్ టి.వి నయ్ కృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, ఎన్నికల విధులు ఎప్పు డు కూడా సవాళ్ళతో కూడుకుని ఉంటాయని అన్నారు.
ఇదివరకు ఇవే ఎన్నికల విధులు నిర్వర్తించాము అని తేలికగా తీసుకోకుండా, ఎప్పటికప్పుడు ఎన్నికల విధుల విషయం లో అన్ని అంశాలపై అవగాహన ఏర్పర్చుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. శిక్షణ తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రతి అం శాన్ని శ్రద్ధగా ఆకళింపు చేసుకుని అప్రమత్తతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని సూచించారు.
పంచాయ తీ ఎన్నికలలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పని చేయడం వల్లే ఎలాంటి తప్పిదాలకు తావు లేకుం డా ఎన్నికలను సజావుగా పూర్తి చేసుకోగాలిగామని అన్నారు. రానున్న ఎన్నికల విషయంలోనూ ఇదే స్పూ ర్తితో పని చేయాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీపీఓ శ్రీనివాస్‌రావు, జెడ్పీ డిప్యూటీ సీఈ ఓ సాయన్న, పంచాయతీ కార్యాలయ ఏ.ఓ రాజబాబు, డీ.ఎల్.పీ. ఓలు, ఎం.పీ.డీ.ఓలు, ఎం.పీ.ఓలు ఇతర అధికారులు పాల్గొన్నారు.