calender_icon.png 12 August, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవ ఇంధనాల వాడకాన్ని మెరుగుపరచాలి

12-08-2025 12:00:00 AM

శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి జీవ ఇంధనాల వాడకాన్ని పెంపొందించేందుకు రైతులు ఆసక్తి చూపాల్సిన అవసరముంది. జీవ ఇంధనాలు పునరుత్పాదక శక్తి వనరులు, శిలాజ ఇంధనాలతో పోలిస్తే పర్యవరణానికి అనుకూలమైనవి. దీనివల్ల కార్బన్ ఉద్గారాలు చాలా తక్కువగా వస్తాయి. ఇవి స్థిరమైన ఇంధన వనరులుగా పిలువబడుతాయి.

పేద దేశాలు సత్వర ఆర్థికాభివృద్ధిని సాధించేందుకై లభ్యమవుతున్న స్వచ్ఛ శిలాజ ఇంధనాలను సంపూర్ణంగా ఉపయోగించుకునే అవకాశమివ్వాలి. అందుకోసం ప్రపంచంలో వివిధ దేశాలు ఆవలంబిస్తున్న విధానాలను పరిశీలించాల్సిన అవసరముంది.  అప్పుడే ఆహార పంటలతో పోటీపడే తత్వం అందరికి చేరువవుతోంది. ఇందుకు దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూతను అందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. 

రైతులకు రాయితీలు అందించి విధి విధానాలతో మార్పులు చేసి ప్రోత్సాహకాలు అందిస్తే రైతులు శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి జీవ ఇంధనాల వాడకంపై ఆసక్తి చూపిస్తారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని రైతులంతా జీవ ఇంధనాలు వాడేలా ప్రోత్సాహకాలు అందించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా.

 సత్యనారాయణ, అల్లాదుర్గం, మెదక్ జిల్లా