18-09-2025 01:20:30 AM
ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
నిజామాబాద, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): 1947 ఆగస్టు 15న భారతదేశనికి స్వాతంత్రం లభించి దేశం నలుమూలల సంబరాలు జరుపుతుంటే దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నిరంకుశ పాలనలో బందీగా ఉంచారన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు దినేష్ కులాచారితో కలిసి అర్బన్ శాసనసభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు,కాసిం రాజ్వి లాంటి క్రూర మృగాలు మన తెలంగాణ ఆడబిడ్డల మానాలు దోచుకుని బట్టలిప్పి బతుకమ్మ ఆడించిన సందర్భంలో ఎదురు తిరిగిన ఎందరో తెలంగాణ సాయుధ పోరాట వీరులను సజీవంగా దహనం దుర్మార్గుడు నిజాం నవాబు అని అన్నారు.
పోరాడితే పోయేది ఏమీ లేదని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాంజీగోండ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, దాశరధి కృష్ణమాచార్యులు, షోయబుల్లా ఖాన్ ఎందరో మహనీయులు నిజాంకు ఎదురుతిరిగి ప్రాణాలు అర్పించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను గుర్తించి, తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారి కంగా నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. నిజాం నవాబు నిరంకుశ పాలనకు ఎదురుతిగిన తెలంగాణ పోరాట వీరుల పటిమను భావి తరాలకు తెలియజేయాలన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ,బీజేపీ నాయకులు న్యాలం రాజు,జిల్లా ఉపాధ్యక్షులు పాలేపు రాజు,జిల్లా కార్యదర్శి జోతి గారు,జిల్లా బీజేపీ నాయకులు,బీజేపీ మండల అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో..
అర్మూర్, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి) : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణ శాఖ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు భూపతి రెడ్డి గారు , మాజీ మున్సిపల్ చైర్మన్ కంచిటి గంగాధర్ లు హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తెలంగాణకు స్వతంత్రం రాలేదని అన్నారు.
అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు స్వస్తి పలకాలని హుకుం జారీ చేసి తెలంగాణకు స్వతంత్రం తేవడం జరిగిందని అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం తెలంగాణలో ప్రతి ఒక్కరు జరుపుకోవాలని కోరడం జరిగింది. తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రం ఆరోజే వచ్చిందని చెప్పడం జరిగింది. విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోల్కం వేణు, జస్సు అనిల్, కలిగోట గంగాధర్, ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్, ఆకుల రాజు, విజయ్, శ్రీధర్, చిన్న రెడ్డి, పులి యుగంధర్, ప్రకాష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.