09-01-2026 12:45:31 AM
ప్రియ డెయిరీ జీఎం చింతపల్లి
మానకొండూర్, జనవరి 8 (విజయ క్రాంతి): విజయ క్రాంతి క్యాలెండర్ చాలా బాగుందని, తెలంగాణ దేవాలయాల ముఖ చిత్రాలతో ముద్రించడం, పూర్తి సమాచారాన్ని అందించడం జరిగిందని ప్రియ డెయిరీ(ప్రియ మిల్స్) జీఎం చింతపల్లి నర్సింహారావు అన్నారు. గురువారం మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ లో గల ప్రియ డెయిరీలో విజయ క్రాంతి ప్రకటనల విభాగం మేనేజర్ బరిగెల ఆంజనేయులు జీఎంకు క్యాలెండర్ ను అందించారు. ఈ సందర్భంగా ఆయన పత్రికల్లో వస్తున్న కథనాలను కొనియాడారు. డెయిరీ అభివృద్ధికి ప్రజలు, పత్రికలు సహకరించాలని కోరారు.