calender_icon.png 10 January, 2026 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొడ్ల డెయిరీ మేనేజర్‌పై దుకాణ యజమాని తల్వార్‌తో దాడి

09-01-2026 12:45:27 AM

ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి విషమం కీసరలో ఘటన 

మేడ్చల్, జనవరి 8 (విజయ క్రాంతి): పాత బకాయిలు చెల్లించే వరకు పాల ప్యాకెట్లు ఇవ్వబోమన్నందు కు దుకాణ యజమాని, డెయిరీ మేనేజర్ పై తల్వార్ తో దాడికి పాల్పడిన ఘటన కీసరలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం కీసరలో పాల దుకాణం నిర్వహించే కిరణ్ దొడ్ల డెయిరీ కి బకాయి పడ్డాడు. గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో పాల ప్యాకెట్ల డెలివరీ సమయంలో పాత బకాయి లు చెల్లిస్తేనే పాల ప్యాకెట్లు ఇస్తామని మేనేజర్ కే శ్రీనివాస్ తెలిపారు.

ప్యాకెట్లు ఇవ్వొద్దని వ్యాను డ్రైవర్ కు మేనేజర్ చెప్పాడు. ఈ సందర్భంగా ఇద్దరు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మేనేజర్ శ్రీనివాస్ పై కిరణ్ తల్వార్ తో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై శ్రీనివాస్ అక్కడే కుప్పకూలి పోయాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ మౌలాలికి చెందిన వాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. నిందితుడు కిరణ్ పరారీ లో ఉన్నాడు.