calender_icon.png 3 January, 2026 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖి చేసిన సర్పంచ్

03-01-2026 12:00:00 AM

పాఠశాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తా

గరిడేపల్లి, జనవరి 2,(విజయ క్రాంతి): మండలంలోని పొనుగోడు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల,అంగన్వాడి కేంద్రాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును గ్రామ సర్పంచ్ కటికం వేణు శుక్రవారం ఆకస్మికంగా తనకి చేశారు.పాఠశాలలోకి వెళ్లి వంటశాలలు,భోజనం నాణ్యత పరిశుభ్రత మెనూ పరిస్థితులను ఆయన పరిశీలించారు.

విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనాన్ని దగ్గరుండి పరిశీలించిన ఆయన ఆహార పదార్థాలు నాణ్యత పై సంతృప్తి వ్యక్తం చేశారు.ఆయన మాట్లాడుతూ వంటశాలను సామాగ్రిని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని  ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ హాజరుకావాలని తరగతులు క్రమబద్ధంగా నిర్వహించాలని అన్నారు.

ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అమలు అవ్వాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.విద్యార్థులతో మాట్లాడి భోజనం పై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని సూచించారు.భవిష్యత్తులో నిరంతరం పాఠశాల పనితీరుపై పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు నేలపట్ల వెంకటేశ్వర్లు చామకూరి గురుస్వామి కోడి మల్లయ్య చామకూరి సుధాకర్ అంజి పోలంపల్లి సైదులు మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది పాల్గొన్నారు