03-01-2026 12:00:00 AM
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
ఫిట్నెస్ లేని బస్సులెన్నో..
తరచూ వెలుగు చూస్తున్న ప్రమాదాలు
భద్రతలేని పయనం, ప్రమాదాల బారిన విద్యార్థులు
ప్రైవేట్ పాఠశాల, కళాశాల యాజమాన్యాల విచ్చలవిడితనం
ఇప్పటికీ దృష్టి సారించని ఆర్టీఏ అధికారులు
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
మణుగూరు, జనవరి 2 (విజయక్రాంతి): పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి తయారైంది. ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను ఇంటి నుంచి తీసుకురావడం, తిరిగి చేర్చేందుకు స్కూల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నాయి. అనుభవం, అర్హత లేని చోదకులు, మద్యం తాగి వాహనాలు నడపడం స్కూల్ బస్ ల నిత్యం ప్రమాదాలకు ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికి వదిలివేస్తున్నాయి. దీంతో జిల్లాలో ఏదో ఒక చోట కళాశాల, స్కూల్ బస్ ల ప్రమాదాలు నిత్య కృత్యంగా మారాయి. దీనిపై విజయక్రాంతి కథనం..
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
జిల్లాలోని మెజార్టీ ప్రైవేట్ పాఠశాల, కళాశాల యాజమాన్యాలు అడ్మిషన్లు, ఫీజు వసూళ్లపై చూపిస్తున్న శ్రద్ధ, బడి బస్సులపై చూపడంలేదనే ఆరోపణలు న్నాయి. పాత వాహనాలకు కొత్తగా రంగులద్ది రోడ్లపై యథేచ్ఛగా తిప్పుతున్నాయి. తక్కువ వేతనానికి పనిచేసే ఎలాంటి అనుభవం, అర్హత లేని డ్రైవర్లను నియ మించుకుని, ఫిట్నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను తీసుకెళ్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.
ఫిట్నెస్లేని బస్సులపై కొరడా ఝులిపించాల్సిన ఆర్టీఏ అధికారులు ఆయా యాజమాన్యాలు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తిపడి కండిషన్ సరిగ్గాలేని బస్సులకు సైతం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు పెద్దఎత్తున వినబడుతున్నాయి. అనుభవంలేని డ్రైవర్లతో విద్యార్థులను తరలిస్తూ వారిని ప్రమాదాలకు గురిచేస్తున్నా ఆర్టీఏ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నా రు. ఫిట్నె స్లేని బస్సుల కారణంగా తరచూ ప్రమాదాలు వెలుగు చూస్తున్నా యి. విద్యార్థులు మృత్యువాతకు, గాయాలపాలు కావడానికి కారణమవుతున్నా యి.
తరచూ వెలుగు చూస్తున్న ప్రమాదాలు..
జిల్లాలోని చాలా ప్రైవేట్ విద్యాసంస్థలు స్కూల్ బస్సుల విషయంలో నిబంధనలు పాటించడం లేదు. అర్హత లేని వారిని డ్రైవర్లగా ఎంపిక చేసి వారి చేతికి బస్సు లు అప్పగిస్తున్నాయి. ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎందరో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుం డగా, మరికొందరు క్షతగాత్రులుగా మారుతు న్నారు. ఫిట్నెస్ లేని బస్సులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 508 ప్రైవే ట్ స్కూల్ బస్సులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
విద్యాసంవత్సరం ప్రారంభంలోనే స్కూల్ బస్సుల ఫిట్నెస్ ను పరిశీలించాలి. ఈ ఏడాది రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తనిఖీ చేశారు. అయితే, ఈ తనిఖీల ను తూతూమంత్రంగా చేశారనే విమర్శ లు ఉన్నాయి. కొన్ని పాఠశాలలు అనధి కారికంగా బస్సులు నడుపుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. వాస్తవానికి సురక్షితమైన, కండీషన్లో ఉన్న బస్సులనే వినియోగించాలి. 15 ఏళ్ల సర్వీసు దాటిన బస్సులను అస్సలు వినియోగించకూడదు. కానీ కొన్ని పాఠశాలలు పాత బస్సులకు రంగులు వేసి నడుపుతున్న ట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఫిట్నెస్లేని బస్సులెన్నో...?
స్కూల్ బస్సులకు సంబంధించి 32 అంశాలతో కూడిన నిబంధనలు పాటించాలి. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ తప్పనిసరి. బస్సులో విద్యార్థుల వివరాల పట్టిక నమోదు చేయాలి. బస్సు ముందు, వెనుక భాగాల్లో స్కూల్ బస్సు, ఆన్ స్కూల్ డ్యూటీ అని రాయాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్సు, ఎమెర్జెన్సీ డోర్ ఏర్పాటు చేయాలి. అగ్నిప్రమాద నివారణ పరికరాలు అందుబాటులో ఉంచాలి.
కిటికీలకు నెట్ తప్పనిసరిగా ఉంచాలి. తలుపులకు లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. పిల్లల కోసం సహాయకులను నియమించాలి. గంటకు 40 కిలోమీటర్ల వేగానికి మించ కుండా స్పీడ్ గవర్నెన్స్ ఏర్పాటు చేయాలి. డ్రైవర్కు హెవీ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు నాలుగేళ్ల అనుభవం ఉండాలి. కానీ మెజార్టీ బస్సుల్లో ఇవేవీ అమలవుతున్న దాఖలాలు లేవు. అంతేగాక ఆయా విద్యాసంస్థలలో ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డుమీద తిరుగుతున్నట్లు ఆరోపణలు వినిపి స్తున్నాయి. ఇప్పటికై నా వీటిపై జిల్లా అధికారులు దృష్టి పెట్టా లని, విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ కల్పించాలని ,విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.