03-01-2026 12:14:04 AM
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో శాసనమండలిలో సభ్యురా లు విజయశాంతి అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు గృహ జ్యోతి లబ్ధిదారుల సంఖ్య 52,82,498 లక్షల మంది కాగా వీరి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 3,593.17 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు చెల్లించిందని వివరించారు.
ఎస్పీడీసీఎల్ పరిధిలో గృహ జ్యోతి లబ్ధిదారుల సంఖ్య 25,35,560 లక్షల మంది కాగా, ఎన్పీడీసీఎల్ పరిధిలో 27,46,938 లక్షల మంది ఉన్నారని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా 52,82, 498 లక్షల కుటుంబాలకు 3,593.17 కోట్లు ఆదా అవడం మూలంగా వారు సామాజికంగా, ఆరోగ్యకరంగా, ఆర్థికంగా ఎదిగేందుకు పిల్లలను మంచి చదువులు చదివించుకునేందుకు ఈ పథకం ఉపయోగపడిందని డిప్యూటీ సీఎం తెలిపారు.
త్వరలో పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తాం
‘ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, సాధ్యమైనంత త్వరగా ఉద్యోగుల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తాం’ అని డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఉద్యోగు లు, ఉపాధ్యాయుల పింఛను చెల్లింపుపై బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చా రు. ప్రభుత్వ ఉద్యోగులు వివిధ అవసరాల కోసం తీసుకున్న ఈఎంఐలకు ప్రతినెలా మొద టి తేదీన చెల్లించకపోతే బ్యాంకులు వారి ఖాతాలు డిఫాల్ట్ జాబితాలో చేరుస్తాయని, గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 18వ తారీఖున కూడా జీతాలు ఇచ్చిన పరిస్థితి ఉంద న్నారు.
దాంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ ప్రభుత్వం వచ్చాక ఆలో చన చేసి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి, ప్రతినెలా ఒకటవ తేదీన ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల జీతాలు చెల్లిస్తున్నా మన్నారు. ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకు ఉద్యోగుల ప్రయోజనాలు చెల్లించకుండా రిటైర్మెంట్ వ యోపరిమితిని 58 నుం చి 61కి మూడు సంవత్సరాలకు గత ప్రభుత్వం పెంచిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
ఆనాటి ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమి తి పెంచకపోయి ఉంటే వాస్తవంగా 2021నుంచి 2023 మధ్య సంవత్సరాల్లో 26,854 మంది పదవి విరమణ పొందా లి... కానీ వయోపరిమితి పెంపుతో కేవలం 6,354 మంది మాత్రమే రిటైర్ అయ్యారని, ఆర్థిక భారా న్ని వాయిదా వే సేందుకే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.
రూ.43,154 కోట్లు బిల్లులు పెండింగ్
2023 డిసెంబర్ నాటికి గత ప్రభుత్వం తమకు వివిధ రకాల బకాయిల కింద రూ. 43,154 కోట్లు బిల్స్ పెండింగ్‌లో పెట్టి వెళ్లిపోయిందని తెలిపారు. ఇందులో కేవలం ఉద్యోగుల బకాయిలే రూ.4,575 కోట్లు ఉన్నాయని, తమ ప్రభుత్వం వచ్చాక పెన్షన్ బెనిఫిట్స్ రూ.1,752 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ.6,244 కోట్లు ఉన్నాయని, ప్రాధాన్యత క్రమంలో ప్రతినెలా ఇబ్బంది లేకుండా చెల్లిస్తూ వెళ్తున్నామని తెలిపారు.
ప్రతినెలా అదనంగా ఉద్యోగుల బకాయిలను క్లియర్ చేసేందుకు రూ. 700 కోట్లకు తక్కువ కాకుండా విడుదల చేస్తున్నామని వివరించారు. మెడికల్ బిల్లులు పెండింగ్‌లో పెట్టడం అమానవీయ అంశంగా తమ ప్రభుత్వం భావించి ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న రూ. 200 కోట్ల పైన మెడికల్ బిల్లులు మొత్తాన్ని క్లియర్ చేశామని, ఇకనుంచి ఏ నెలకు ఆ నెల మెడికల్ బిల్లులు క్లియర్ చేస్తామని తెలిపారు. ఇకనుంచి సప్లమెంటరీ శాలరీ బకాయిలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామని తెలిపారు.
ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సిన హెల్త్ స్కీమును వారే డిజైన్ చేసుకొని రావాలని చెప్పామని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. మొదటి తేదీ నా జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీల కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.