03-01-2026 12:00:00 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్
నూతన సంవత్సరం కాస్తా కాంగ్రెస్ పాలనలో బూతు సంవత్సరంలా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి వద్ద సబ్జెక్ట్ లేదని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకపోయినా బూతులు పుష్కలంగా ఉన్నాయి. ఒకపక్క కేసీఆర్‌ను ఉరితీయాలంటూనే, మరో పక్క ఆయనే సలహాలు ఇవ్వాలనడం సీఎం ద్వంద్వవైఖరికి నిదర్శనం. పక్క రాష్ట్రంతో జలవివాదాలున్నప్పు డు తెలంగాణపై అవగాహన ఉన్నవారు సలహాదారులుగా ఉండాలి. కానీ, ఇక్కడి ప్రాజెక్టు లపై కేసులేసిన ఆంధ్ర వ్యక్తి ఆదిత్యనాథ్‌ను పెట్టుకొని ఏపీకి నీళ్లు దోచిపెడుతున్నారు.
ప్రశ్నలకు జవాబు లేకే మైకులు కట్
బీఆర్‌ఎస్ విప్ కేపీ వివేకానంద
సీఎం సభ ప్రారంభానికి ముందే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ దగ్గరికి వెళ్లినట్లు వీడియోలు తీయించి, వాటిని రిలీజ్‌చేసి డ్రామా లు ఆడుతున్నారు. బయట ఇష్టానుసారం మాట్లాడుతూ లోపల మాత్రం నటిస్తున్నారన్నారు. ఇన్ని రోజులుగా ప్రతి పక్షం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదని, తా ము మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు అధి కార మదం నెత్తికెక్కిందని, గతంలో రేవంత్ అన్నట్లుగానే ఇప్పుడు బీహార్ వాళ్ల చేతిలో రాష్ట్రం ఉందా అని ప్రశ్నించారు.