03-01-2026 12:39:17 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 2 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు శుక్రవారం ప్రారంభమై సభ మొదలైన వెంటనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. యూరియా కొరతపై చర్చ జరపాలం టూ బీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబట్టారు. కాంగ్రెస్ వచ్చింది.. యూరియా కొరత తెచ్చిందంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇలా చేయడం సరికాదన్నారు.
ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతీ అంశంపై జవాబు చెబుతామని తెలిపారు. ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయని.. ముఖ్యమైన అంశాలపై చర్చించా ల్సి ఉందన్నారు. సభకు సహకరించాల్సిందిగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. సభ్యుల ఆందోళనల నడుమే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమా ర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అంతకుముందు అసెంబ్లీ మెంబర్స్ ఎంట్రీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేశారు. యూరియా కొరతపై చర్చించా లంటూ ప్ల కార్డ్స్ ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు.
‘షాప్‌లలో లేని యూరియా యా ప్‌లలో ఉంటుందా’ అంటూ ప్లకార్డులు ప్రద ర్శించారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ప్లకార్డులను పోలీసులు లోపలికి అను మతివ్వలే దు. దీంతో పోలీస్‌లతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు వాగ్వాదం జరిగింది. హరీశ్‌రావు స్పం దిస్తూ... తాను మాట్లాడిన తర్వాతనే పోలీసులకు సరెండర్ లీవ్‌ల డబ్బులు వచ్చాయని, యూరియా మీద కూడా రైతు ల పక్షాన మాట్లాడితే యూరియా వస్తుందని స్పష్టం చేశారు.
అయితే సభలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పక్షపాత వైఖరికి నిరసనగా అసెం బ్లీ శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్టుగా హరీశ్‌రావు ప్రకటించారు. సభ నుం చి వాకౌట్ చేసిన తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి గన్ పార్క్ వరకు కాలినడకన వచ్చారు. సేవ్ డెమోక్రసీ, అసెంబ్లీ నపుడుతున్నారా.. సీఎల్పీ మీటిం గ్ నడుపుతున్నారా, స్పీకర్ వైఖరి నశించాలి, ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం.. బూతుల రాజ్యం, మూర్ఖుల రాజ్యం అం టూ నినాదాలు చేశారు.
‘ముఖ్యమంత్రివా లేక వీధి రౌడీవా!?’
‘ముఖ్యమంత్రివా లేక వీధిరౌడీవా.. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషే నా ఇది.. అసెంబ్లీని మొత్తం బూతులమయం చేశారు. కేసీఆర్‌పై చావు మాట లు, అడ్డగోలు కూతలు కూస్తున్నారు. మూ సీ నదిని ప్రక్షాళన చేస్తామంటున్న రేవంత్‌రెడ్డి.. అంతకంటే ముందు తన నోరును ఫినాయిల్ పెట్టి కడుక్కోవాలి. అప్పుడే ఆయన మాటలకు విలువ ఉంటుంది’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర పదజాలం తో విరుచుకుపడ్డారు.
అసెంబ్లీ సమావేశాల ను బహిష్కరించిన తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వరకు పాదయాత్ర చేసి అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. శాసనసభ లో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయం అని చెప్పుకునే అసెంబ్లీలో అధికార పక్షం విలువలన్నింటినీ తుంగలో తొక్కిందని విమర్శించారు.
బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా సభను ఇష్టారాజ్యంగా న డుపుతున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి ఏకపక్షంగా గంటన్నర సేపు మాట్లాడటం ఏ సంప్రదాయం.. మూసీ ప్రాజెక్టుపై చర్చించాలను కుంటే షార్ట్ డిస్కర్షన్ పెట్టి మరుసటి రోజు ఎంత సమయమైనా కేటాయించాలి. కానీ, సీఎం మాత్రం అడ్డగోలుగా మాట్లాడుతూ, ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.. అని మండిపడ్డారు.
అసెంబ్లీ నిర్వ హణ తీరు పూర్తిగా పక్షపాతంగా ఉందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఇది శాసనసభలా లేదు.. గాంధీభవన్ కార్యవర్గ్గ సమావే శాలా, కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్స్‌గా రేవంత్‌రెడ్డి మార్చేశారని ధ్వజమెత్తారు. మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. బాధ్యతాయుతమైన సమాధానం చెప్పాల్సింది పోయి, చిల్లర మాటలతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను విమర్శించవద్దని స్పీకర్ మాకు రూల్స్ చెబుతున్నా రు. ‘
దేశంలో ప్రధాని మోదీని రాహుల్ గాం ధీ విమర్శించడం లేదా.. అక్కడ లేని రూల్స్ ఇక్కడ మాకెందుకు వర్తిస్తాయి’ అని స్పీకర్ వైఖరిని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి వాడిన భాషపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. కేసీర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడానికి వ్యతిరేకంగా.. ఈ సమావేశాల ను బహిష్కరించినట్లు ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వరకు పోరాడుతామ ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.