calender_icon.png 3 January, 2026 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పవన్‌కల్యాణ్ పర్యటన.. పటిష్ట బందోబస్తు

03-01-2026 12:00:00 AM

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

జగిత్యాల, జనవరి 2 (విజయ క్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా 1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో  పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  తెలిపారు. కొత్త సురేష్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బందోబస్తు బ్రీఫింగ్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు పాల్గొని, సంబంధిత అధికారులు, పోలీస్ సిబ్బందికి పూర్తి వివరాలతో బ్రీఫింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యటన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును సెక్టార్ల గా విభజించి అదనపు ఎస్పి స్తాయి అధికారులను బాధ్యులుగా నియమించడం జరిగిందని అన్నారు. ప్రతి అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన విధులను అత్యంత అప్రమత్తతతో నిర్వర్తించాలని సూచించారు. పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్, వాహనాల రాకపోకలు, పార్కింగ్ ప్రదేశాలు, హెలిప్యాడ్ ప్రాంతాలు, కీలక కూడళ్ల వద్ద భద్రతా ఏర్పాట్ల గురించి జిల్లా ఎస్పీ వివరించారు.

ముఖ్యంగా ట్రాఫిక్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని ఆదేశించారు. ప్రజలు, అభిమానులు పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని, పర్యటనను సజావుగా నిర్వహించేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు  భీమ్ రావు, శ్రీనివాస్,  డిఎస్పీ లు వెంకటరమణ, రఘు చందర్, రాములు, తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

జగిత్యాల, జనవరి 2 (విజయక్రాంతి): ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టు పర్యటన సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లు పరిశీలించారు. డిప్యూటీ సిఎం పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సభా స్థల ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.  అనంతరం హెలిప్యాడ్, శిలాపలకం, గుడి ఆవరణ ప్రదేశంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. 

పర్యటన నేపథ్యంలో కొడగట్టు ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు, పోలీసు బందోబస్త్  ఉంటుందని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు సంయమనం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డి.ఆర్.డి.వో రఘువరన్, ఆర్ అండ్ బి ఈ.ఈ శ్రీనివాస్, డీఎస్పీ రఘు చందర్, ఆలయ ఈ.వో, ట్రైని డిప్యుటీ కలెక్టర్ హరిణి, తదితరులు పాల్గొన్నారు.