calender_icon.png 13 November, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గళ గర్జనల జడివాన అందెశ్రీ

11-11-2025 12:00:00 AM

తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావానికి ఆ గొంతుక, ఆ కలం నుంచి వెలువడిన పాటలు జీవనాడిలా, ఊపిరిలా నిలి చాయి. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అనే పాట ఆధునిక సమా జంలో మానవీయ విలువలు, నైతిక ప్ర మాణాలు ఎలా పతనమవుతున్నాయో, మనిషి కేవలం స్వార్థంతో ఎలా జీవిస్తున్నాడో లోతుగా విశ్లేషిస్తూ యావత్ ప్రజా నీకాన్ని ఆత్మవిమర్శ చేసుకునేలా ఆలోచింపజేసింది. ఆ పాటలోని ఆర్తి, సందేశం ఆ యన రచన ఎంత గొప్పదనేదీ లోకానికి చాటి చెబుతుంది.

అనుక్షణం ప్రజల మ ధ్యనే జీవిస్తూ, తాను నడియాడిన నేలను విడిచి బ్రతకలేనంటూ తన తుది శ్వాస వరకు ఒక సామాన్య మానవుడిగానే జీ వించి, తన సాహిత్యంతో కోట్ల ప్రజల హృ దయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఆ అద్వితీయ వాగ్గేయకారుడు అందెశ్రీ. ఆ యన రచనలు చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలబడతాయి. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ పాట ‘జయ జయహే తెలం గాణ’ గీతం. ప్రత్యేకించి ‘జయజయహే తె లంగాణ’ గీతం కేవలం ఒక పాట మాత్ర మే కాదు.

అది తెలంగాణ ప్రజల దశాబ్దా ల ఆకాంక్షకు, పోరాట త్యాగాలకు ప్రతీకగా నిలిచిన ఉద్యమ గీతం. తెలంగాణ రాష్ర్టం సిద్ధించిన పదేళ్ల తరువాత ఈ ఉద్యమ గీతాన్ని రాష్ర్ట గీతంగా ప్రకటించడం అందె శ్రీ సాహిత్యానికి దక్కిన అత్యున్నత గౌర వం. ఈ గీతం తెలంగాణ రాష్ర్ట ప్రజల ఉ ద్యమ స్ఫూర్తికి, చరిత్రకు, సంస్కృతికి, గొ ప్పదనానికి సజీవ రూపంగా అద్దం పడుతుంది. అందెశ్రీ భౌతికంగా మనకు దూర మైనప్పటికీ ‘జయ జయహే తెలంగాణ’ పాటలో ఆయన చిరంజీవిగానే నిలిచి ఉంటారు. 

కవిత్వం నేపథ్యం..

అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన 1961 జూలై 18న వరంగల్ జిల్లా (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా), మద్దూరు మం డలం, రేబర్తి గ్రామంలో జన్మించారు. ఆ యన బాల్యం కష్టాల కడలిలో అనాథగా గడిచింది. ఆయనకు ఏ విధమైన సంప్రదాయ, అధికారిక విద్య లభించలేదు. ఆ యన నిరక్షరాస్యుడైనప్పటికీ, తెలంగాణ పల్లె వాతావరణంలో, జానపద కళారూపాలతో మమేకమై అపారమైన అనుభ వాన్ని, లోకజ్ఞానాన్ని సంపాదించారు.

బా ల్యంలో గొర్రెలు కాసే వృత్తిలో, ప్రకృతి ఒడిలో స్వతస్సిద్ధంగా పాటలు ఆశువుగా అల్లేవారు. తెలంగాణ పల్లె జీవితం, శ్రమ, కష్టాలు, పండుగల సంస్కృతి ఆయన కవిత్వానికి తొలి గురువులుగా నిలిచాయి. పల్లెటూరి జీవన విధానం, జానపద సాహి త్యం, పాటలు ఆయన కవిత్వానికి మూల స్తంభాలుగా మారాయి. ఎలాంటి సాహి త్య నేపథ్యం లేకపోయినా, తనలోని సహజసిద్ధమైన ప్రతిభతో, స్వయంకృషితో అ గ్రశ్రేణి కవుల్లో ఒకరిగా ఎదిగారు. శృంగేరి మఠానికి చెందిన శంకర్ మహారాజ్ ఆయన పాటలు విని ప్రత్యేకంగా ప్రోత్సహించారు.

ఉద్యమ సారథి

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా, సాంస్కృతిక సారథిగా అందెశ్రీ ని రుపమానమైన, మహోన్నతమైన పాత్ర పోషించారు. ఆయన పాటలు, కవిత్వం తె లంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని, అంతర్గత చైతన్యాన్ని నింపాయి. ‘తెలంగాణ ధూంధాం’ కార్యక్రమాలకు రూపకల్పన చేసి, రూపశిల్పిగా ఉండి ప్రజల్లో రాజకీ య అవగాహన కల్పించారు. ఆయన రచనలు తెలంగాణ ప్రజల సామ్యవాద ఆకాంక్షలకు ప్రతిబింబాలుగా నిలిచాయి. తెలు గు సినిమా రంగంలో రచయితగా వారి పాత్ర మరువలేనిది. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ పాటను ‘ఎర్ర స ముద్రం’ సిని మా కోసం రాశారు. ఈ పా ట ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాల తె లుగు సిలబస్ లో కూడా చేర్చబడింది.

‘పల్లె నీకు వందనములమ్మో’ వంటి పాటలు తెలంగాణ పల్లెటూరి స్వచ్ఛతను, సహజత్వాన్ని కండ్ల కు కట్టినట్టుగా ప్రదర్శిస్తాయి. ‘గంగ’, ‘బతుకమ్మ’, ‘బొమ్మల కొ లువు’ వంటి అనేక సినిమాలకు పాట లు, సందర్భోచిత సంభాషణలు అందించి, త న సాహిత్య ప్రతిభను వెండితెరపై కూడా అద్భుతంగా చాటుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2006 లో ‘గంగ’ చిత్రానికి ఉత్తమ గేయ రచయితగా ప్రతిష్ఠాత్మక నంది పురస్కారం లభించింది. దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, ‘లోకకవి’ బిరుదుతోపాటు అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబ ల్ పీస్ వారి గౌరవ డాక్టరేట్ వంటి అనేక జాతీయ, సాహితీ పురస్కారాలు అందుకున్నారు అందెశ్రీ.

అక్షరమే చైతన్యంగా..

అందెశ్రీ కవిత్వం కేవలం భావోద్వేగాలను మాత్రమే కాక, సామాజిక, రాజకీయ స్పృహను కూడా మేల్కొలిపింది. ఆయన రచనల్లోని పద బంధాలు సాధారణ ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండి, వారి హృదయాలను హత్తుకునేవి. దళితులు, బహుజనులు, అణగారిన వర్గా ల బాధలు, ఆకాంక్షలు ఆయన సాహిత్యానికి ప్రధాన వస్తువులు. ఈ ప్రజాకవి తన పాటల ద్వారా కేవలం ప్రశ్నించడమే కాకుండా, పాలకులలో బాధ్యతను గుర్తుచేశారు. అందుకే ఆయన గీతాలు ప్రజా స్వామ్య వ్యవస్థలో ఒక నిరంతర విమర్శనాస్త్రంగా పనిచేస్తున్నాయి.

ఉద్యమ సమ యంలో ఆయన పాటలు కార్యకర్తలకు ఆయుధాలుగా మారగా, నేడు అవి పాలకులకు నిరంతరం తమ బాధ్యతను గుర్తు చేసే హెచ్చరిక గంటలుగా మారుతున్నా యి. ఆయన కవితా అందెల స్వరానికి మరణం లేదు. ఎందుకంటే ఆయన పాట లు కేవలం వర్తమానం కోసం రాసినవి ఎంతమాత్రం కాదు. అవి నాటికి, నేటికి, రేపటికి కూడా సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాయి. నేటి యువత, కళాకారులు పదవుల వ్యామోహంలో పడకుం డా, నిజాయితీగా కళా సేవ చేయాలనే గొ ప్ప ఆదర్శాన్ని అందెశ్రీ తన జీవితం ద్వా రా, సాహిత్య వారసత్వం ద్వారా చూపించారు. పాట రూపంలో ప్రశ్నించే ఆ గొం తుక మూగబోయినా, ఆ పాట మాత్రం స జీవంగా ఉండిపోయింది.

ఇది తెలంగాణ కళాకారులకు, రచయితలకు ఎప్పటికీ ప్రేరణగా, చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆయన అందించిన సాహిత్య వారసత్వం అజరామరం, అది తెలంగాణ గడ్డపై ఎప్పటికీ మార్మోగుతూనే ఉం టుంది. అందెశ్రీ జీవితం, కవిత్వం, సాహిత్యానికి.. పాఠశాల విద్య ఏమాత్రం అడ్డంకి కాదని, కేవలం అనుభవం, నిబద్ధత, ప్రజలపై నిస్వార్థమైన ప్రేమ ఉంటే సరికొత్త చరిత్రలు సృష్టించవచ్చని నిరూపించారు. ఆయన పాటలు తరతరాలకు తెలంగాణ సంస్కృతి, ఉద్య మ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి. ఆయ న కేవలం కవి కాదు, తె లంగాణ ఆత్మగౌరవానికి శాశ్వత ప్రతీకగా నిలిచిన ప్రజా కవి, యుగపురుషుడు అందెశ్రీ.

వ్యాసకర్త సెల్: 7981781086