calender_icon.png 5 January, 2026 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ సంపద కార్పొరేట్ల పాలు..

04-01-2026 06:20:46 PM

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ 

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఎన్నికలకు ముందు ప్రజల్ని భూటకపు హామీలతో నమ్మించి అధికారంలోకి వచ్చిన పాలకులు కార్పోరేట్ సంస్థలకు దేశ సంపద ను కట్టపెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. సీపీఐ శతజయంతి ఉత్సవ జీప్ జాత ఆదివారం బెల్లంపల్లి కి చేరుకుంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనింగ్ మాఫియా కోసం  అడవులను నరికివేస్తున్నారని మండిపడ్డారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు హామీ ఇచ్చిన కేంద్ర మోదీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చినా మోదీ ప్రభుత్వం కార్పోరేట్ల కోసం దేశంలోప్రజల రక్తాన్ని తాగమరిగిందని ద్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టపెడుతున్నాదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ రంగాలకు అప్పగిస్తూ దేశప్రజల్ని బిచ్చగాళ్లను చేస్తున్నదని విమర్శించారు. పెట్టుబడిదారుల కోసం చట్టాలను మార్చి ప్రజల్ని బానిసల్ని చేస్తున్నదని విమర్శించారు.

సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి  మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తికై నిజాంను గద్దె దించడానికి జరిగిన మహత్తరమైనది తెలంగాణ సాయుధ పోరాటమన్నన్నారు. 4500 మంది ప్రాణ త్యాగాలతో 3000 గ్రామాల విముక్తి పది లక్షల ఎకరాల భూమిని పంచిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదన్నారు. అనాటి సాయుధ అనేకమంది వీరులకు జన్మనిచ్చిందనీ, వారి స్పూర్తితోనే నేటికీ తెలంగాణ పోరాటగడ్డగా బాసిల్లుతున్నదనన్నారు. వీరోచిత పోరాటాల ఫలితంగానే పాలకులు భూసంస్కరణ చట్టం, గరీబి హటావో బ్యాంకుల జాతీకరణ లాంటి అనేక సంస్కరణలను చేయాల్సి వచ్చిందన్నారు.

మూడవ తారీకు  తాండూరు నుండి ప్రారంభమైన జాతకు జిల్లా పార్టీ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు,  బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ నాయకత్వం వహిస్తూరని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలో జాతను నిర్వహిస్తూ 9వ తారీకు లోపు జిల్లా వ్యాప్తంగా జాతాను నిర్వహించి పదో తారీకున రామకృష్ణాపూర్ లో సభ నిర్వహించడం జరుగుతుందనీ తెలిపారు. జనవరి 18న సిపిఐ శత జయంతి ఉత్సవాల బహిరంగ సభ ఖమ్మంలో జరుగుతుందని అశేష ప్రజానీకం తరలివెళ్లాని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి రాష్ట్ర సమితి సభ్యురాలు పూర్ణిమ జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య,  జాతీయ సమితి సభ్యులు బాపు, తాండూరు మండల కార్యదర్శి బానేష్, పట్టణ సహాయ కార్యదర్శి తిలక్ అంబేద్కర్, జిల్లా సమితి సభ్యులు, శ్రీధర్, కొంకుల రాజేష్, రత్నం రాజం, సోని, ఉపేందర్, మంతెన రమేష్, చందు,శంకర్, రత్నం ఐలయ్య, రామచందర్, రాయమల్లు, సౌజన్య తిరుమలేష్, పాల్గొన్నారు.