27-11-2025 12:52:53 AM
మహబూబాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయంలో గత నాలుగు రోజులుగా ఎంతో పవిత్రంగా నిర్వహింపబడిన సుబ్రహ్మణ్యయాగం బుధవారం పూర్ణాహుతి, వేలాది మంది భక్తుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణంతో సుసంపన్నమైంది.
రెండు గంటలపాటు శ్రీ వల్లీదేవసేనా ఇద్దరు దేవేరులతో స్వామివారికి జరుపబడిన కళ్యాణోత్సవ తంతు ఆధ్యంతం భక్తులకు ఒక దివ్యానుభూతిని కలిగించింది. కళ్యాణోత్సవం అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణోత్సవంలో ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, మోతుకూరి మయూరి రామేశ్వర్రావు, జారతి వెంకటేశ్వర్లు,అనంతుల శ్రీనివాస్ లు పాల్గొన్నారు. దేవాలయమును సందర్శించిన భక్తులందరికీ ఆలయ ప్రాంగణంలో తగు సదుపాయాలను ఆలయ ఈ.ఓ రామల సునీత నేతృత్వంలోకల్పించబడ్డాయి.