calender_icon.png 24 October, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

24-10-2025 01:12:51 AM

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి, అక్టోబర్23(విజయ క్రాంతి) రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. గురువారం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ లో డి.సి.ఏం.ఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ వేణు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ రైతులు దళారీల చేతుల్లో మోసపోకుండా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందని, 14 శాతం తేమతో రూ. 2400 రూపాయలు మొక్కజొన్నలకు ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ఎప్పుడు రైతుల మేలు కోరుతుందన్నారు.

మొక్కజొన్నలు, పత్తి ,వరి, మిర్చి, పొద్దు తిరుగుడు రైతులు ఏ పంట పెట్టిన ఆ పంటకు ప్రభుత్వం మద్దతు ఇచ్చి రైతులను పంట నష్టపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో 22 నెలల కాలంలో చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, బిఆర్‌ఎస్ నాయకులు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసిన ఈ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకు పోతుందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 24 గంటలు రైతులకు కరెంటు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. గత వేసంగి, ప్రస్తుత వర్షాకాలం పంటలకు ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇవ్వబోతుందని, వ్యవసాయం చేయడంలో రైతును మించిన అనుభవజ్ఞుడు ఎవరు లేరన్నారు.

ఈ భూమిలో ఏ పంట పెడితే పండుతుందో రైతు ఆ మట్టిని బట్టి చెప్పుతడన్నాడు. త్వరలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించి గింజ కటింగ్ లేకుండా వారి ధాన్యం కొనడం జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి తో పాటు స్వయాన రైతు అయిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతినిత్యం రైతుల కోసమే ఆలోచన చేస్తూ వారి సంక్షేమం కోసం ఎన్నో గొప్ప గొప్ప మార్పులు తీసుకొస్తున్నారని,

పెద్దపల్లి నియోజకవర్గంలో గత పాలకులు రైతుల దగ్గర క్వింటాలు వడ్లకు 10 కిలోల పైన తరుగు పెట్టీ వారి నడ్డివిరిచారని, మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను శాసనసభ్యుడుగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి తరుగు లేకుండా చేసి రైతన్నలకు మేలు చేశామని ప్రజలకు గుర్తు చేశారు.

తదుపరి వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో వరి పంటకు మద్దతు ధర పట్టిక పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు, పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, డిఎం శ్రీకాంత్ ప్రవీణ్, మార్కెట్ చైర్మన్ మాజీ ఎంపీపీ గోపగాని సరయ్య గౌడ్, గజనవేన సదయ్య, సింగిల్ విండో చైర్మన్లు మరియు మార్కెట్ డైరెక్టర్లు మరియు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.