calender_icon.png 19 August, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి

18-08-2025 12:05:34 AM

ఖమ్మం, ఆగస్ట్ 17 (విజయ క్రాంతి): తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం జిల్లాలో పలు శుభకార్యాల్లో పాల్గొని ప్రజలను ఆప్యాయతగా పలకరించి, తన చిన్ననాటి మిత్రులను కూడా ఈ శుభ కార్యక్రమాల్లో కలుసుకున్నారు.కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలో ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు.

అనంతరం గంగమ్మతల్లి ఆలయంలో బోనాల జాతరలో పాల్గొని భక్తులతో కలిసిపోయారు. మల్లేపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో పురం ఉపేందర్ కుమారుని వివాహం, నేలకొండపల్లి ఏఎంసీ మార్కెట్ యార్డులో చిలకల రాములు కుమారుని వివాహం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుసగా జరిగిన పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, రిసెప్షన్లకు హాజరై ఆశీర్వచనాలు అందించారు.

వెంకటగిరిక్రాస్ రోడ్లోని శ్రీహర్ష కన్వెన్షన్, నాయుడుపేట పీవీఆర్ గార్డెన్స్, రెడ్డిపల్లి ఏఆర్ గార్డెన్స్, సత్యనారాయణపురం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు.

ఖమ్మం నగరంలోని రామన్నపేట, ఉషాహరి కన్వెన్షన్, సిటీ సెంట్రల్ కన్వెన్షన్, ఎస్‌ఆర్ కన్వెన్షన్, పుట్టకోటతో పాటు అనేక ప్రాంతాల్లో జరిగిన శుభకార్యాల్లోనూ పాల్గొన్నారు. శ్రీనగర్ కాలనీలో శెట్టిపల్లి వెంకటేశ్వర్లు మనమరాళ్ల ఓణీల అలంకరణ వేడుకలోనూ పాల్గొన్నారు.ప్రతీ చోటా పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు.