calender_icon.png 8 May, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు వైద్యులు ఉండటం లేదు

08-05-2025 12:02:04 AM

మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు 

సిద్దిపేట, మే 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు వైద్యులు అందుబాటులో ఉండ టం లేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. బుధవా రం సిద్దిపేట నియోజకవర్గంలోనూ చిన్నకోడూరు సిద్దిపేట రూరల్ సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి మాటలు మూరెడు ఉంటే చేతలు జానెడు మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. సిద్దిపేటలో అభివృద్ధి పనులను అడ్డుకున్న ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు నమ్మకం ఉండేదని గుర్తు చేశారు. 195 మంది లబ్ధిదారులకు రూ.43 లక్షల సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకల్లో పాల్గొని ఫోటోలు ఆవిష్కరించా రు.

మహిళలకు ఇస్తానన్న రూ 2500, రైతుబంధు, కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరలు అన్ని బంద్ అయిపోయాయని కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని ఎగనామం పెట్టారని చెప్పారు. ఒకప్పుడు సిద్దిపేట ప్రాంతంలో చెరువులు నిండాలంటే గ్రామాలలో కప్పతల్లి ఆట ఆడేవారని ఇప్పుడు ఇక్కడ నిర్మించిన ప్రాజెక్టులతో చెరువులు కళకళలాడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో నే హనుమాన్ మాల ధరించిన స్వాములకు అన్నదాన సత్రం నిర్మించిన ఘనత సిద్దిపేట నియోజకవర్గ నారాయణరావుపేటకు దక్కిందని చెప్పారు.

రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు కురిసి దాన్యం తడిసిపోతే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నిమ్మకు నీరేత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పారు. మూలగే నక్కపై తాటిపండు పడ్డట్టు రైతుల పరిస్థితి తయారయింది అన్నారు. ఆరుగాలం కష్టప డి పండించిన పంట కొనే దిక్కు లేక రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కి పరిపాలించే చేతకాకపోతే దిగిపోవాలనిపితు పలికారు. జిల్లా కలెక్టర్లు రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 

భారత సైన్యానికి సెల్యూట్... 

భారతదేశంలో టెర్రరిస్టులకు స్థానం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పాకిస్థాన్లో టెర్రరిస్టుల స్థావరంపై భారతీయ సైన్యం దాడి చేసి మట్టు పెట్టడం దేశ ప్రజల విజయంగా వెల్లడించారు. భారత సైనికులకు సెల్యూట్ తెలిపారు.