calender_icon.png 9 May, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతితో సాదా బైనామా సమస్యకు చెక్

08-05-2025 12:00:00 AM

నల్లగొండ, మే 7 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో సాదా బైనమా, పిఓటి వంటి సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కల్పించిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం నకిరేకల్ మండలం చందనపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.

భూములకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే రాష్ట్రప్రభుత్వం పైలెట్ మండలం నకిరేకల్  గ్రామాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల లో దరఖాస్తులు ఇవ్వాలని ఆమె చెప్పారు. భూముల సమస్యలపై గతంలో నిర్వహించిన 4 పైలెట్ మండ లాలు మినహాయించి  ప్రస్తుతం 28 జిల్లాలలో ఒక పైలెట్ మండలాన్ని ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని ఆదేశించడం  జరిగింది.

ఇందులో భాగంగా ఈ నెల 5 నుండి తిరిగి జిల్లాకు ఒక పైలట్ మం డలంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి అక్కడి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నది. నల్గొండ జిల్లాకు సంబంధించి నకిరేకల్ మండలాన్ని పైలట్ మండలంగా తీసుకోగా, ఈ నెల 5 నుండి ఆ మండలంలోని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతున్నది. నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, తదితరులు రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారు.