calender_icon.png 3 August, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలుండవు

03-08-2025 12:35:26 AM

- పార్టీ ఆదేశాలను శిరసావహిస్తాం

- కేంద్ర మంత్రి బండి సంజయ్ 

చొప్పదండి, ఆగస్టు 2: బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. పార్టీ ఆదేశాలను శిరసావహిస్తామని పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా చొప్పదం డిలో కిసాన్ సమ్మాన్ నిధి, సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము పదవి కావాలంటూ సొంత నిర్ణయాలను పార్టీ నాయకత్వంపై రుద్దబోమని, బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అన్నారు.  నాయకత్వం ఏది చెబితే అది శిరసావహించి పనిచేస్తామని చెప్పారు. దయ చేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాయొద్దని కోరుతున్నా అని అన్నారు. కాగా రైతు ను రారాజు చేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని బండి సంజయ్ కుమార్ చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్‌డిఓ మహేశ్వర్, డీఈవో చైతన్య జైనీ, బిజెపి నాయకులు పాల్గొన్నారు.