calender_icon.png 11 October, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిగులు టీచర్లు 21 వేల మంది

11-10-2025 01:37:53 AM

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 12,994 ప్రభుత్వ బడుల్లో 21,140 మంది మిగులు టీచర్లు ఉన్నారు. పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ వివరాలు, ఏ పాఠశాలలో ఎంత మంది టీచర్లు ఉన్నారనే వివరాలను తీసింది. అయితే ఉపాధ్యాయులు, విద్యార్థుల రేషియో జీవో నెం.25 ప్రకారం ఈ తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో మొత్తం 24,227 బడుల్లో 99,076 మంది టీచర్లకు 1,04,605 మంది టీచర్లు పనిచేస్తున్నారని, అయితే 21,140 మంది టీచర్లు అదనంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

7,364 పాఠశాలల్లో 15,611 మంది టీచర్ల లోటు ఉంది. మిగులు టీచర్లు ఉన్నచోటు నుంచి ఎవరైనా డిప్యూటేషన్ మీద ఉపాధ్యాయులు వచ్చి ఉంటే వారిని తిరిగి వారి వారి స్థానాలకు పంపించేలా ఆయా జిల్లా కలెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలను ఇవ్వనుంది. ఇదిలా ఉంటే వారం రోజుల్లో నూతన జాబితా ప్రకారం డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు నియామకపత్రాలను అధికారులు అందించనున్నట్లు తెలిసింది.