calender_icon.png 11 October, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి సమస్య తీర్చాలని మున్సిపల్‌లో ఫిర్యాదు

11-10-2025 01:38:58 AM

తూప్రాన్, అక్టోబర్ 10 :తాగునీటి సమ స్య తీర్చాలంటూ తూప్రాన్ మున్సిపల్ పద వ వార్డులోని కాలనీవాసులు తాగునీటి కొ రకు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. వార్డుల్లో ప్రైవే ట్ కంపెనీ వారి సొంత నిధులతో కాలనీవాసుల దాహార్తి తీర్చుటకు గాను వాటర్ ప్లాం ట్ ను ఏర్పాటు చేశారు. దాంతో వార్డు పరిధిలో తాగునీటి కొరత తీరింది.

కానీ మిషన్ చెడి పోవడంతో కాలనీ వాసులకు మళ్ళీ స మస్య మొదటికొచ్చింది. కూడలిలో ఏర్పాటుచేసిన వాటర్ ట్యాంకుల నీరు తాగి రో గాల భారిన పడడం జరుగుతుందని, తక్షణ మే మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకొని మిషన్ రిపేర్ చేయించాలని కోరారు. ఈ కా ర్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రాజిరెడ్డి, బాబు, ఎల్లారెడ్డి, సిద్ధ గౌడ్, సత్య నారాయణ, నాగేందర్ రెడ్డి, బాబుగౌడ్, ముత్యాలు ఉన్నారు.