04-02-2026 12:54:16 AM
తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్‌నగర్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ఎంతో ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కు అనుగుణంగా సౌకర్యాలను పెంచాల్సిన అవసరం ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక 4.21 కోట్ల రూపాయల వ్యయంతో జీ ప్లస్ త్రీ పద్దతిలో చేపట్టిన కిచెన్, డైనింగ్ హాల్ భవన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
పూజల అనంతరం భవన నిర్మాణ పనుల గురించి అధికారులు ఎమ్మె ల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. గ్రౌండ్‌లో వాహనాల పార్కిం గ్, మొదటి అంతస్తులో కిచెన్, రెండు, మూడు ప్లోర్ లలో డైనింగ్ హాల్ ఏర్పాటు చేసేలా భవనం డిజైన్ చేసినట్లు అధికారులు వివరించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈఓ శంకర్, హైమావతి, అమీర్‌పేట సర్కిల్ సుజాత, మహేష్, టూరి జం హన్మంత రెడ్డి, ఎలెక్ట్రికల్ సుధీర్, శానిటేషన్ వెంకటేష్, బిఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్‌రెడ్డి, హన్మంతరావు, నాయకులు అశో క్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, పీయూష్ గుప్తా, వనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.