17-12-2025 01:20:59 AM
మార్చి 3న జరగాల్సిన పరీక్షలు 4న నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండియర్ మ్యాథమెటిక్స్-2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీ క్షలను మార్చి 4న నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం రివైజ్డ్ షెడ్యూల్‌ను బోర్డు అధికారులు విడుదల చేశారు. మార్చి 3న హోలీ పండుగ సెల వు నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు పేర్కొన్నారు.
మిగతా పరీక్షలన్నీ యథా విధిగా జరుగుతాయని వెల్లడించారు. గతం లో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు జరగనున్నా యి. ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు జరగనున్న విషయం తెలిసిందే.