17-12-2025 01:15:42 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్16 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేసి ఓడిన అభ్యర్థి.. తనకే ఓటేశారని పుసుపు బియ్యం పట్టాలని, లేదంటే తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఇబ్బందులకు గురిచేసిన ఘటన ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామంలో చో టుచేసుకుంది. గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి వగాడి శంకర్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
ఈ నెల 14న జరిగిన రెండో విడత పోలింగ్‌లో వెలువడిన ఫలితాల్లో ఆయన ఓడిపోయాడు. మంగళవారం ఆ యన తన భార్యతో కలిసి గ్రామంలోని పలు వాడల్లో తిరిగాడు. తాను ఓట్ల కోసం డబ్బు లు ఇచ్చానని, డబ్బులు తీసుకున్న వారు ఓటు వేయకపోవడం వల్లే ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
తనకు ఓటు వేసిన వారు పసుపు బియ్యం పట్టుకోవాలని, అలా చేయని వారు తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతూ ఓటర్ల ఇళ్లకు వెళ్లి అడిగాడు. ఓటు వేసిన వారు పసుపు బియ్యం పట్టిస్తే సరిపోతుందని, పసుపు బియ్యం పట్టని వారు మాత్రం డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఈ సంఘటన స్థా నికంగా కలకలం రేపగా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే విధంగా వ్యవహరించ డంపై చర్చ జరుగుతోంది.