26-06-2024 12:05:00 AM
ముంబై, జూన్ 25: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధిచెందుతుందన్న విశ్వాసంతో ఉన్నామని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. మంగళవారం బొంబే చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 188వ వార్షిక సర్వసభ్య సమావేశంలో దాస్ మాట్లాడుతూ తాము 7.2 శాతం వృద్ధి పట్ల నమ్మకంతో ఉన్నప్పటికీ, ఎటువంటి అంచనాలకైనా కొంత అప్‌సైడ్, డౌన్‌సైడ్ రిస్క్‌లు ఉంటాయన్నారు. భారత్ జీడీపీ 8 శాతం క్రమ వృద్ధి సాధించేదిశగా కదులుతున్నదని చెప్పారు.