12-09-2025 06:08:57 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఏకలవ్య మోడల్ స్కూల్ లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రీడల్లో భాగంగా రెస్లింగ్ పోటీలో ఆడుతుండగా బి.చరణ్ విద్యార్థి కుడి చేయి విరిగింది. వెంటనే స్పందించిన నిర్వాహకులు 108 కు సమాచారం ఇచ్చారు. పైలెట్ గోవర్ధన్, ఈఎంటి రాంబాబు సంఘటన స్థలానికి చేరుకొని చరణ్ కు ప్రధమ చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. చరణ్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి క్రీడా పోటీల్లో ప్రాతినిత్యం వహిస్తున్నాడు.