12-09-2025 05:44:59 PM
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.అనిత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్ కు తగు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్ అనిత మాట్లాడుతూ ..... సామాజిక ఆరోగ్య కేంద్రంకు వచ్చే రోగులకు అన్ని రకాల వైద్యము అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఓపికి వచ్చే అందరి వివరములను నమోదు చేసి పరీక్షలు చేయాలన్నారు. పెద్దంపేట గ్రామానికి చెందిన 5 సంవత్సరం పాప జిల్లా ఆసుపత్రిలో మరణించినాడు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందించిన వైద్య సేవలు గురించి తెలుసుకున్నారు.
అదేవిధంగా 17వ తేదీ నుండి ప్రారంభమయ్యే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమైన స్వస్థనారీలో అందించే సేవల పైన ప్రత్యేక వైద్య నిపుణులు ద్వారా అందించే వార వివరాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. జ్వరాలు ఇతర సమస్యలతో వచ్చే వారికి అన్ని పరీక్షలు చేసి నమోదు చేసుకోవాలన్నారు. సరియైన వైద్యం అందించాలని ప్రజలతో సత్సంబంధాలు. పెంచుకోవాలన్నారు. వైద్య సేవలు, ల్యాబ్ ను, ఓపి రిజిస్టర్ లను, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లను 72 రకాల పరీక్షలు ఉచితంగా అందిస్తున్నందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్య సేవలు అందించే అన్నిటిని పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ పద్మ, డిపిహెచ్ఎన్ ఆర్ఎస్, హెడ్ నర్సులు, వైద్యులు వైద్య సిబ్బంది, జిల్లా అధికారి బుక్క వెంకటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.