12-09-2025 05:42:54 PM
చిట్యాల(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఇసుక తరలించడానికి వెళ్లిన ట్రాక్టర్లు వరద ప్రవాహంతో వాగులో చిక్కుకున్నాయి. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోనీ గర్మిల్లపళ్లి- ఒడితల గ్రామాల మధ్యలో మానేరు వాగులో ఈ సంఘటన జరిగింది. నిన్న రాత్రి కురిసిన జోరు వానతో వరద ప్రవాహం కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది.
ఇసుక కోసం ఉదయాన్నే వెళ్లిన ట్రాక్టర్లు లోడ్ అవుతున్న క్రమంలో ఆ వరద నీటిలో చిక్కుకున్నాయి.దీనిపై స్పందించిన టేకుమట్ల పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. అయితే కొన్ని ట్రాక్టర్లను రక్షించినట్లు సమాచారం.ట్రాక్టర్ డ్రైవర్లకు ఏటువంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలపడంతో ట్రాక్టర్ యజమానులు ఊపిరిపీల్చుకున్నారు.