calender_icon.png 12 September, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమిలేని నిరుపేదలకు కానుక ..28న ఆరు వేలు

16-12-2024 01:43:34 AM

కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటి విడుత..

బీఆర్‌ఎస్ తినడానికి అప్పులు చేస్తే.. కాంగ్రెస్ వాటిని తీర్చడానికి అప్పులు చేసింది

  1. అప్పుల లెక్కలు పక్కాగా ఉన్నాయ్
  2. అసెంబ్లీలో చర్చిద్దామా?
  3. అప్పులపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం 
  4. పదేళ్లలో 7,11,911 కోట్లు అప్పులు చేసిన బీఆర్‌ఎస్ సర్కార్ 
  5. అప్పులు,వడ్డీల కింద రూ.66,772 కోట్లు కడుతున్నాం
  6. సంక్రాంతి లోగా  రైతు భరోసా 
  7. రైతులకు వ్యవసాయానికి రూ. 50,953 కోట్లు ఖర్చు 
  8. ఖమ్మంలో మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

ఖమ్మం, డిసెంబర్ 15 (విజయక్రాంతి): భూమి లేని నిరుపేద కుటుంబా లకు ఏడాదికి రెండు విడతల్లో రూ.12 వేలు ఆర్థికసాయం చేస్తామని ఎన్నికల ముందు  కాంగ్రెస్ చేసిన వాగ్దానాన్ని ఈనెల 28వ తేదీ నుంచి అమలు చేయబోతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు డిసెంబ ర్ 28న రాష్ట్రంలోని నిరుపేద కూలీల కుటుంబాలకు మొదటి విడతగా 6వేల రూపాయలను ప్రజా ప్రభుత్వం  చెల్లిస్తుందని చెప్పారు.  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ప్రకటించిన విధంగా  వచ్చే సంక్రాంతి  నుంచి రైతులకు రైతు భరోసా  డబ్బులు  ఇస్తామని తెలిపారు. 

దేశంలో ఏ రాష్ట్రం  చేయని విధంగా  2 లక్షల  రుణాలు ఉన్న రైతులందరికీ నేరుగా వారి ఖాతా ల్లో 21వేల కోట్ల రూపాయలను జమ చేసి, దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభు త్వం  నిలిచిందన్నారు. రాష్ట్ర ఆర్థిక, అప్పు ల పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రజలను  తప్పుదోవ పట్టించే విధంగా  అబద్ధాలు ప్రచారం చేస్తోందని విక్రమా ర్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆదివారం ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు.  గత పదేళ్లలో  ప్రత్యక్షంగా, పరోక్షంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన 7,11,911 కోట్ల  రూపాయల అప్పులకు సంబంధించి  తమ దగ్గర పక్కా  లెక్కలు ఉన్నాయని తెలిపారు. నేడు తాము అప్పు లు చేసినట్లుగా  ఆ పార్టీ ప్రచారం చేయడం సరికాదన్నారు. 

బీఆర్‌ఎస్ సర్కార్  తినడానికి అప్పులు చేస్తే  వారు చేసిన అప్పులకు అసలు, వడ్డీలు కట్టేందుకు  కాంగ్రెస్  ప్రభు త్వం అప్పులు చేసిందని వివరించారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన నాటి నుంచి  రూ.54,118 కోట్లు  అప్పులు చేయగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకు మొత్తం రూ. 66,782  కోట్లు  బ్యాంకులకు కట్టామన్నారు. 

అసెంబ్లీలో  ఎవరు ఎన్ని అప్పులు చేశారో అసెం బ్లీలో చర్చించేందుకు  తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం  ఏర్పడిన 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వం  నేరుగా తీసుకున్న అప్పులు  72,658 కోట్లు ఉండగా,  2024 నాటికి 3,89,673 కోట్లు రూపాయలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులు  చేసిందని వివరించారు. 

కార్పొరేషన్ల పేరిట  ప్రభుత్వం గ్యారంటీ  ఇచ్చి తీసుకున్న  అప్పు లు 2014 నాటికి  5,893 కోట్ల రూపాయ లు ఉండగా,  2024 నాటికి 95,462 కోట్లు , ప్రభుత్వ గ్యారంటీ లేకుండా  వివిధ కార్పొరేషన్లు నేరుగా చేసిన అప్పులు  2014 నాటి కి  ఏమీలేకపోగా,  2024 నాటికి 59,414 కోట్లు రూపాయలు అప్పులు  గత పాలకు లు  చేశారన్నారు.

ఇవే కాకుండా  గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పాలకులు  ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్,  హా స్పిటల్, ఉద్యోగుల జిపిఎఫ్, మిడ్‌డే మీల్స్, పీజురియంబర్స్‌మెంట్  తదితర వాటికి  అ ప్పుగా  పెట్టినవి 40,154 కోట్ల రూపాయ లు ఉన్నాయని , వీటన్నింటిని కలిపితే  మొ త్తం 7,11,911 కోట్ల అప్పుల భారాన్ని  గత బీఆర్‌ఎస్ పాలకులు  ప్రజలపై  మోపి తగుదనమ్మా అంటూ కేటీఆర్, హరీశ్‌రావులు ప్ర జలను తప్పుదోవ పట్టించే విధంగా  రాష్ట్రంఅప్పులు గురించి  పచ్చి అబద్ధాలు  మాట్లా డుతున్నారని మండిపడ్డారు. 

రాష్ట్ర ప్రభు త్వం  చేసిన అప్పులకు బ్యాంకులకు  2014 నాటికి సంవత్సరానికి  రూ.6400 కోట్లు మాత్రమే చెల్లించగా,  గత 10 ఏళ్లలో బీఆర్‌ఎస్ చేసిన  అప్పుల వల్ల  అప్పులు, వడ్డీలు కట్టడానికి  66,782 కోట్ల రూపాయలు చె ల్లించే దుస్థితికి ఈ రాష్ట్రాన్ని  తీసుకెళ్ళి, గా యిగాయిగా మాట్లాడడం దేనికని అన్నారు. 

బీఆర్‌ఎస్  నాయకులకు గాలి మాటలు చె ప్పడం, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు భ్రమ లు కల్పించి, ప్రజలను మోసం చేయడం బా గా తెలుసని అన్నారు.  ప్రజా ప్రభుత్వం  అధికారంలోకి రాగానే  గత బీఆర్‌ఎస్ పాలకులు  చేసిన ఆర్థిక విధ్వంసం  అప్పుల గురించి  శ్వేతపత్రం  అసెంబ్లీలో  విడుదల చేసి, ప్రజలకు  వాస్తవాలు  చెప్పామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక  పరిస్థితి బాగా లేనప్పటికీ  ఎన్నికల్లో  ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలను అమలు చేస్తున్నదని చెప్పారు. 

రైతుల కోసం 50,953 కోట్లు ఖర్చు

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయానికి, రైతుల కోసం నేరుగా  50,953 కోట్లు ఖర్చు చేసిందని  భట్టి తెలిపారు.  రైతు భరోసాకు 7625 కోట్లు , రైతు రుణమాఫీకి  21వేల కోట్ల, రైతు భీమా ప్రీమియం  చెల్లింపునకు రూ. 1514 కోట్లు, ఫర్ డ్రాప్ మోర్ క్రాప్  కోసం  40 కోట్లు, రైతులకు విత్తనాల కోసం  36 కోట్లు, వ్యవసాయ పంపు సెట్లకు  ఇస్తున్న   సబ్సిడీకి రూ. 11,270 కోట్లు  ఇస్తున్నామన్నారు. 

వ్యవసాయానికి కావాల్సిన  సాగునీరు పనుల కోసం  9795 కోట్లు కలిపి మొత్తం  50, 953 కోట్లు  ఖర్చు చేసి నిబద్ధ్దత చాటుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని చెప్పారు. అదే విధంగా  గత ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని పూర్తిగా  విస్మరించగా  ప్రజా ప్రభుత్వం  ఎకరాకు  పదివేలు  చెల్లించిందని చెప్పారు. 

బీఆర్‌ఎస్   కట్టామని చెప్పుకుంటున్న  కాళేశ్వరం  ప్రాజెక్టుతో సంబంధం లేకుండా  గత కాంగ్రెస్ ప్రభుత్వాలు  నిర్మాణం చేసిన  ప్రాజెక్టుల నుంచి  పారిన నీళ్లతో  పండిన ప్రతి గింజను  ప్రజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.  కొనుగోలు చేసి ధాన్యం  డబ్బులను  వారం రోజుల్లో  రైతులకు  చెల్లిస్తున్నామని చెప్పారు.  సన్న వడ్లకు  క్వింటాకు 500 బోనస్  చెల్లిస్తున్నామన్నారు. 

ప్రతి ఎకరాకు  పది నుంచి పదిహేను వేల రూపాయలను అదనంగా  రైతులు లబ్ధి పొందుతున్నారని అన్నారు.  1.20 లక్షల కోట్ల  రూపాయలతో గొప్పగా,అద్భుతంగా  కాళేశ్వరం కట్టామని బీఆర్‌ఎస్  నాయకులు చెప్పారని,  కానీ కాళేశ్వరంతో సంబంధం లేకుండా ఈ ఏడాది  వరి ఉత్పత్తి  గణనీయంగా పెరిగిందన్నారు.  

నాలుగు కొత్త విమానాశ్రయాలు 

రాష్ట్ర వ్యాప్తంగా  పరిశ్రమల విస్తరణ కోసం ప్రజా ప్రభుత్వం  కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో  ప్యూచర్ సిటీని నిర్మాణం చేస్తున్నామన్నారు.  అంతర్జాతీయ ప్రమాణాలతో  కూడిన స్పోర్ట్స్ యూనివర్శిటీ, స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు  చేస్తున్నామన్నారు. 

రాష్ట్ర రాజధాని  హైదరాబాద్ నగరం గుండా 55 కిలోమీటర్లు  మేర ప్రవహిస్తున్న  మూసిని  ప్రక్షాళన చేసి, పునర్జీవం  తీసుకువచ్చేందుకు  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.  అన్ని జిల్లాలను కలుపుతూ  రీజనిల్ రింగ్‌రోడ్డు  ఏర్పాటు చేస్తామన్నారు.  ఓటర్ రింగ్ రోడ్  రీజనల్ రింగ్ రోడ్ మధ్యన ఇండస్ట్రీయల్ , హౌసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసి, భవిష్యత్  తరాలకు అందిస్తామన్నారు.